మీ టూత్‌పేస్ట్ శాకాహారమేనా!?
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:45 AM
మీరు వాడే సబ్బు లేదా షాంపూను శాకాహార ఉత్పత్తులతో తయారు చేశారా!? లేక అందులో జంతు కొవ్వులను కలిపారా!? అని ఇకనుంచి మీరు సులభంగా తెలుసుకోవచ్చు. సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్ వంటి సౌందర్య, అలంకరణ ఉత్పత్తుల ప్యాకేజింగ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేయడమే ఇందుకు కారణం.
సౌందర్య, అలంకరణ ఉత్పత్తులపై ఎరుపు
ఆకుపచ్చ చుక్కలు తప్పనిసరి: కేంద్రం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: మీరు వాడే సబ్బు లేదా షాంపూను శాకాహార ఉత్పత్తులతో తయారు చేశారా!? లేక అందులో జంతు కొవ్వులను కలిపారా!? అని ఇకనుంచి మీరు సులభంగా తెలుసుకోవచ్చు. సబ్బులు, షాంపూలు, టూత్‌పేస్ట్ వంటి సౌందర్య, అలంకరణ ఉత్పత్తుల ప్యాకేజింగ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేయడమే ఇందుకు కారణం. కొత్త నిబంధనల ప్రకారం.. సదరు ఉత్పత్తిని శాకాహార పదార్థాలతో తయారు చేశారనుకోండి.. దాని ప్యాకేజింగ్‌పై ఆకుపచ్చ రంగు చుక్క ఉండాలి. అదే, మాంసాహార పదార్థాలు కలిపారనుకోండి.. ప్యాకేజీపై ఎరుపు లేదా బ్రౌన్ రంగు చుక్క ఉండాలి. అది కూడా అందరికీ కనిపించేలా సదరు ప్యాకేజీకి అగ్ర భాగంలో ఉండాలి. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనలు, 2011కు కేంద్ర కన్జూమర్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ సవరణలు తీసుకొచ్చింది. దాంతో, సోమవారం నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. నిజానికి, కొన్ని ఉత్పత్తులపై ఇప్పటికే ఆకుపచ్చ, ఎరుపు రంగు చుక్కలు ఉంటున్నాయి. కానీ, ఇకనుంచి అన్ని ఉత్పత్తులపైనా వాటిని శాకాహార పదార్థాలతో తయారు చేశారా!? లేక మాంసాహార పదార్థాలతోనా అని స్పష్టం చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది.
ఈ వార్తలను చదవండి
వీధిలో డీజే.. గుండెపోటుతో 2వ తరగతి బాలిక మృతి
వైభవంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగు చిత్రాలకు 9 అవార్డులు