Share News

ఢిల్లీలో దారుణం.. ఐఆర్ఎస్ అధికారి కూతురి దారుణ హత్య..

ABN , Publish Date - Apr 22 , 2026 | 07:47 PM

ఐఆర్ఎస్ అధికారి కూతురు ఇంట్లోనే హత్యకు గురైంది. దుండగుడు హత్యకు ముందు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

ఢిల్లీలో దారుణం.. ఐఆర్ఎస్ అధికారి కూతురి దారుణ హత్య..
IRS Officer's Daughter

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఐఆర్ఎస్ అధికారి కూతురు ఇంట్లోనే హత్యకు గురైంది. దుండగుడు హత్యకు ముందు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఓ సీనియర్ ఐఆర్ఎస్ అధికారి అమర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. బుధవారం కుటుంబసభ్యులంతా పని మీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో ఐఆర్ఎస్ అధికారి 22 ఏళ్ల కూతురు ఒంటరిగా ఇంట్లో ఉంది. సాయంత్రం కుటుంబసభ్యులు ఇంటికి తిరిగి వచ్చారు.


గదిలో విగత జీవిగా పడి ఉన్న యువతిని చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆ వివరాల మేరకు.. యువతి హత్యకు గురైంది. చనిపోవడానికి ముందు ఆమెపై అత్యాచారం జరిగింది. దుండగుడు సెల్‌ఫోన్ ఛార్జర్ కేబుల్‌తో ఆమె గొంతు బిగించి చంపాడు.


పోలీసులు రాహుల్ అనే 19 ఏళ్ల యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అతడు ఆ ఇంట్లో పని చేశాడు. నెల రోజుల క్రితం అతడిని పనిలోంచి తీసేశారు. పోలీసులు రాహుల్‌ను ఎంక్వైరీ చేయడానికి అతడి ఇంటికి వెళ్లారు. అతడు ఆ సమయంలో ఇంట్లో లేడు. కుటుంబసభ్యులు, స్థానికులను పోలీసులు ఎంక్వైరీ చేశారు. గతంలో అతడిపై వేధింపుల కేసు ఉన్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి అతడు అల్వార్ నుంచి ఢిల్లీ వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. స్పేర్ కీని ఉపయోగించి అతడు ఐఆర్ఎస్ అధికారి ఇంట్లోకి చొరబడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న అతడి కోసం అన్వేషిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

బాలికల కాలేజీలో కోఎడ్యూకేషన్ ఏర్పాటు పై హైకోర్టు అసంతృప్తి

ఐపీఎల్ 2026: రాజస్థాన్ రాయల్స్‌తో పోరు.. టాస్ నెగ్గిన లఖ్‌నవూ సూపర్ జెయింట్స్

Updated Date - Apr 22 , 2026 | 08:13 PM