బడికెళ్లే పిల్లల్నీ చంపేస్తున్నారు
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:57 AM
అమెరికా, ఇజ్రాయిల్ దేశాల సైనికులు ఇరాన్‌లో పాఠశాలలకు వెళ్లే పసిపిల్లలపై కూడా బాంబులు వేసి కిరాతకంగా హతమారుస్తున్నారని ఆ దేశ (సుప్రీం లీడర్) దౌత్యవేత్త...
ఇరాన్ దౌత్యవేత్త ఆయతుల్లా అబ్దుల్ మజీద్ కంటతడి
అక్కయ్యపాలెం (విశాఖపట్నం), రాజమహేంద్రవరం, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): అమెరికా, ఇజ్రాయిల్ దేశాల సైనికులు ఇరాన్‌లో పాఠశాలలకు వెళ్లే పసిపిల్లలపై కూడా బాంబులు వేసి కిరాతకంగా హతమారుస్తున్నారని ఆ దేశ (సుప్రీం లీడర్) దౌత్యవేత్త ఆయతుల్లా అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ అన్నారు. ఇరాన్‌లోని మినాబ్‌లో 160 మంది విద్యార్థులు బాంబు దాడిలో మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఆయన కంటతడి పెట్టారు. విశాఖ, రాజమహేంద్రవరంలో పలు ముస్లిం సంస్థ లు గురువారం నిర్వహించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సంస్మరణ సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘అలీ ఖమేనీ నిరాడంబర జీవితం గడిపారు. ఆయన తన కుటుంబంతో కలిసి అద్దె భవనంలో ఉండేవారు. యుద్ధం నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సైన్యం సూచించినా ఆయన అంగీకరించలేదు. దేశ ప్రజలకు రక్షణగా, వారి మధ్యనే ఉండటానికి ఇష్టపడ్డారు’’ అని తెలిపారు. హోర్ముజ్ జలసంధివద్ద భారత నౌకల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇరాన్- భారత్ మధ్య బంధానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నదన్న ఆయన.. మహాత్మాగాంధీ తమకు ఆదర్శం అని తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి