పెట్రోల్ బంక్ సీల్ చేసేందుకు వెళ్లిన ఐవోసీ అధికారి దారుణ హత్య
ABN , Publish Date - Oct 08 , 2026 | 03:59 AM
ఓ పెట్రోల్ బంక్‌ను సీల్ చేసేందుకు వెళ్లిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) అధికారి దారుణ హత్యకు గురయ్యారు
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఘటన
న్యూఢిల్లీ, అక్టోబరు 7: ఓ పెట్రోల్ బంక్‌ను సీల్ చేసేందుకు వెళ్లిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) అధికారి దారుణ హత్యకు గురయ్యారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లా అంబాచొండి గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఐవోసీ చైర్మన్ ఏఎస్ సాహ్నే తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సాంకేతిక సమస్యల కారణంగా 3 నెలలుగా మూసి ఉంచిన అంబాచొండిలోని ఐవోసీ పెట్రోల్ బంక్‌ను సీల్ చేసేందుకు రిటైల్ సేల్స్ మేనేజర్ మహేశ్ షెల్కే, ఇతర అధికారులతో కలిసి అక్కడికెళ్లారు. అయితే మరికొంత సమయమివ్వాలని బంక్ యజమాని కుటుంబం అధికారులను కోరింది. దీనికి వారు ఒప్పుకోకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే మహేశ్‌పై కత్తితో బంకు యజమాని కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఏడు సార్లు పొడవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ వార్తలు కూడా చదవండి
అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంక.. నేలపై పడుకొని ప్రియాంక నిరసన.
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.