వీసా మోసానికి పాల్పడ్డారంటూ భారత సంతతి యువతిపై దుష్ప్రచారం
ABN , Publish Date - Aug 09 , 2026 | 05:54 AM
భారత సంతతి యువతి సాధన గొల్లపూడిపై ఓ సామాజిక మాధ్యమ ఖాతాదారు చేస్తున్న దుష్ప్రచారాన్ని యూఎస్ హ్యూస్టన్ అటార్నీ తిప్పికొట్టారు. ‘సైబర్‌గ్రీన్09’ యూజర్‌నేమ్‌తో ఉన్న...
న్యూఢిల్లీ, ఆగస్టు 8: భారత సంతతి యువతి సాధన గొల్లపూడిపై ఓ సామాజిక మాధ్యమ ఖాతాదారు చేస్తున్న దుష్ప్రచారాన్ని యూఎస్ హ్యూస్టన్ అటార్నీ తిప్పికొట్టారు. ‘సైబర్‌గ్రీన్09’ యూజర్‌నేమ్‌తో ఉన్న ఒకరు ఎక్స్ ఖాతాలో జూలై 30న ఒక సందేశం పోస్టు చేశారు. దానిలో ‘ఈమె సాధన గొల్లపూడి. 2014 నుంచి ఈమె ఎఫ్1 విద్యార్థిగానే ఉన్నారు. టెక్సా్‌సలోని హ్యూస్టన్‌లో సాధన సాంప్రదాయక ‘బేర్ ఫుట్ క్రాబ్ డ్యాన్స్’ ను ఆస్వాదిస్తుంటారు. వివిధ ప్రోగ్రామ్స్‌లో రిజిస్టర్ అవుతూ 12 ఏళ్లుగా ఆమె విద్యార్థి వీసాతో ఆటాడుకుంటున్నారు. ఫీజు తీసుకొని ట్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు’ అని పేర్కొన్నారు. సాధన కూచిపూడి నృత్యం చేస్తున్న వీడియోను పోస్టుకు జత చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై యూఎస్ హ్యూస్టన్ అటార్నీ ఆరోన్ రీట్జ్ ఆగస్టు 4న స్పందించారు. ‘విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నా కార్యాలయం విషయాన్ని పరిశీలించింది. ఆమె విద్యార్థి వీసాపై లేరు. ఆమె యూఎస్ పౌరురాలు’ అని అటార్నీ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆగ్రాలో రహదారిపై భారీ గుంత.. అందరూ చూస్తుండగానే..
డిగ్రీలు మాత్రమే కాదు.. దేశ స్వప్నాన్నీ సాకారం చేయాలి: మోదీ