Share News

భారతీయ యువ గణిత శాస్త్రవేత్తకు రామానుజన్ ప్రైజ్

ABN , Publish Date - Oct 07 , 2026 | 02:15 PM

భారతీయ యువ గణిత శాస్త్రవేత్త మహేశ్ కక్డే‌ను రామానుజన్ ప్రైజ్ వరించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల యువ గణిత యువశాస్త్రజ్ఞల కేటగిరీలో మహేశ్ కక్డే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకున్నారు.

భారతీయ యువ గణిత శాస్త్రవేత్తకు రామానుజన్ ప్రైజ్
Mahesh Kakade Ramanujan Prize

భారతీయ యువ గణిత శాస్త్రవేత్త మహేశ్ కక్డే‌ను రామానుజన్ ప్రైజ్ వరించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల యువ గణితశాస్త్రజ్ఞులకు ఈ అవార్డును ఇస్తారు. ప్రస్తుతం మహేశ్ కక్డే ఐఐఎస్‌సీలో (బెంగళూరు) ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. నంబర్ థియరీలో విశేష కృషి చేసిన ఆయనను ఈ అవార్డు వరించింది. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ ఫిజిక్స్, ఇంటర్నేషనల్ మేథమెటికల్ యూనియన్ సంయుక్తంగా ఈ అవార్డును 45 ఏళ్ల లోపు ప్రతిభావంతులకు ప్రదానం చేస్తాయి.


నంబర్ థియరీలో ముఖ్యభాగమైన ఆల్జీబ్రాయిక్ నంబర్ థియరీలోని పలు సమస్యలకు పరిష్కారం కనుగొన్న కక్డే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇవసావా థియరీపై కృషికి గాను ఆయనకు విశేష గుర్తింపు దక్కింది. గాస్-స్టార్క్, బ్రుమర్- స్టార్క్ కంగక్చర్‌లపై కూడా ఆయన కృషి చేశారు. అంకెలు, ఈక్వేషన్లు, ఇతర సంక్లిష్ట గణిత నిర్మాణాల మధ్య సంబంధాన్ని వెలికితీసేందుకు కక్డే కృషి చేశారు.


బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌లో కక్డే బ్యాచిలర్ ఆఫ్ మేథమెటిక్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, కింగ్స్ కాలేజ్ లండన్‌లో కూడా కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేశారు. అనంతరం 2019లో ఐఐఎస్‌సీలో ప్రొఫెసర్‌గా చేరారు. 2022లో ఆయనను ఇన్ఫోసిస్ ప్రైజ్ ఇన్ మేథమెటికల్ సైన్సెస్ వరించింది. 2023లో ఆసియా టాప్ 100 శాస్రవేత్తల్లో ఒకరిగా నిలిచారు. ఇక రామానుజన్ ప్రైజ్ గ్రహీతలకు 10 వేల డాలర్ల నగదు బహుమతి కూడా ఇస్తారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇండియా కూటమి ఎంపీలకు ఖర్గే విందు.. తదుపరి కార్యాచరణపై చర్చ

నేర్చుకోవడంలో నేనెప్పుడూ విద్యార్థిగానే ఆలోచిస్తా: ప్రధాని మోదీ

Updated Date - Oct 07 , 2026 | 02:44 PM