Share News

మేజర్‌ అభిలాషకు ‘యూఎన్‌ మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌’ పురస్కారం

ABN , Publish Date - Jun 08 , 2026 | 05:41 AM

భారత సైన్యంలో యుద్ధ హెలికాప్టర్‌ నడిపిన తొలి మహిళా పైలట్‌గా రికార్డు సృష్టించిన మేజర్‌ అభిలాష బరాక్‌ ప్రతిష్టాత్మక ‘యూఎన్‌ మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2025’...

మేజర్‌ అభిలాషకు ‘యూఎన్‌ మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌’ పురస్కారం

న్యూఢిల్లీ, జూన్‌ 7: భారత సైన్యంలో యుద్ధ హెలికాప్టర్‌ నడిపిన తొలి మహిళా పైలట్‌గా రికార్డు సృష్టించిన మేజర్‌ అభిలాష బరాక్‌ ప్రతిష్టాత్మక ‘యూఎన్‌ మిలిటరీ జెండర్‌ అడ్వకేట్‌ ఆఫ్‌ ద ఇయర్‌-2025’ అవార్డును అందుకున్నారు. పశ్చిమాసియా దేశం లెబనాన్‌లో మహిళలు, బాలికల కోసం చేపట్టిన విస్తృత సేవా కార్యక్రమాలకు గాను ఆమెను ఈ పురస్కారం వరించింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ శుక్రవారం ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను సేవ చేస్తున్నవారితో పాటు, తనతో కలసి పనిచేస్తున్న వారికి ఆమె ఒక రోల్‌ మోడల్‌ అని కొనియాడారు. మేజర్‌ సుమన్‌ గవానీ, మేజర్‌ రాధికా సేన్‌ తర్వాత మన దేశం నుంచి ఈ పురస్కారం అందుకున్న మూడో మహిళగా అభిలాష నిలిచారు. హరియాణాలోని రోహ్‌తక్‌కు చెందిన అభిలాష 2018 సెప్టెంబరులో ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్‌ కార్ప్స్‌లో చేరారు. ప్రస్తుతం ఆమె లెబనాన్‌లోని ఐక్యరాజ్య సమితి మధ్యంతర దళం (యూఎన్‌ఐఎ్‌ఫఐఎల్‌) కింద భారత బెటాలియన్‌లో ఎంగేజ్‌మెంట్‌ టీమ్‌ కమాండర్‌గానూ, జెండర్‌ ఫోకల్‌ పాయింట్‌గానూ సేవలు అందిస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 05:41 AM