వాయుసేనతో నీట్ ప్రశ్నపత్రాల రవాణా
ABN , Publish Date - Jun 08 , 2026 | 05:54 AM
ఈ నెల 21న నిర్వహించనున్న నీట్(రీ ఎగ్జామ్) ప్రశ్నపత్రాల తరలింపు విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. దీనికోసం తొలిసారిగా భారత...
తొలిసారిగా ఐఏఎఫ్ సేవలు వాడుకోనున్న ఎన్‌టీఏ
న్యూఢిల్లీ, జూన్ 7: ఈ నెల 21న నిర్వహించనున్న నీట్(రీ ఎగ్జామ్) ప్రశ్నపత్రాల తరలింపు విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. దీనికోసం తొలిసారిగా భారత వాయుసేన(ఐఏఎఫ్) సేవలను వినియోగించుకుంటున్నామని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. ప్రశ్నపత్రాలను ముద్రణాలయాల నుంచి పరీక్షా కేంద్రాలకు చేరవేసే వరకూ ఎలాంటి అవకతవకలకూ తావులేకుండా వాయుసేన పర్యవేక్షణలో విమానాల ద్వారా వాటిని రవాణా చేయనున్నట్టు వెల్లడించారు. మరోవైపు, నీట్ పునఃపరీక్ష పేపర్ లీకైందని లేదా ఆన్‌లైన్‌లో విక్రయానికి ఉందని పేర్కొంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులు, తల్లిదండ్రులను ఎన్‌టీఏ హెచ్చరించింది. వాటిని నమ్మొద్దని సూచించింది. భారత్‌లోని 551 నగరాలతోపాటు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈ నెల 21న నీట్-యూజీ రీఎగ్జామ్ నిర్వహిస్తున్నట్టు ఎన్‌టీఏ తెలిపింది. దీనికి సంబంధించిన పరీక్ష నగరాల సమాచారాన్ని(ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్) ఆదివారం అధికారికంగా విడుదల చేసింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏ నగరంలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయో ముందుగానే తెలుసుకుని తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
లిఖితపూర్వక సమాధానం ఇవ్వండి
నీట్ పేపర్ లీక్, సీబీఎ్‌సఈ ఓఎ్‌సఎం వివాదాలపై దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్రంగా స్పందించింది. ఎన్‌టీఏ, సీబీఎ్‌సఈలు దీనిపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కోరింది. పేపర్ లీక్ అంటే ఏమిటో నిర్వచించాలని, 2018 నుంచి నిర్వహిస్తున్న పరీక్ష (నీట్)ల్లో ఎప్పుడైనా లీక్ జరిగిందా అని చెప్పాలని కోరింది. ఎన్‌టీఏలోని సిబ్బంది సంఖ్య, 2022 నుంచి చేపట్టిన నియామకాల వివరాలను కూడా తెలియజేయాలని కమిటీ కోరింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News