భారత పౌరసత్వ నిబంధనల్లో మార్పులు
ABN , Publish Date - May 02 , 2026 | 06:00 AM
పౌరసత్వ నిబంధనలు 2009కి పలు మార్పులను జోడిస్తూ పౌరసత్వ(సవరణ) నిబంధనలు 2026ను...
న్యూఢిల్లీ, మే 1: పౌరసత్వ నిబంధనలు 2009కి పలు మార్పులను జోడిస్తూ పౌరసత్వ(సవరణ) నిబంధనలు 2026ను కేంద్ర హోంశాఖ నోటిఫై చేసింది. ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డుదారులు, పౌరసత్వ దరఖాస్తులకు సంబంధించిన ప్రక్రియల్లో డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 7ఏ కింద ఓసీఐ కార్డు నమోదు, ఓసీఐ హోదాను వదులుకోవడానికి సబంధించిన అన్ని దరఖాస్తులను ఇకనుంచి ప్రభుత్వం నిర్దేశించిన అధికారిక పోర్టల్ ద్వారానే దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రెండు ప్రతులుగా దరఖాస్తులు సమర్పించాలంటూ గతంలో ఉన్న నిబంధనను తొలగించింది. గురువారం ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. భారత పాస్‌పోర్టును కలిగి ఉన్న ఒక మైనర్.. ఏ సమయంలోనూ మరో దేశ పౌరసత్వాన్ని కలిగి ఉండకూడదు.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ