Share News

51వేల కోట్లతో కొత్తగా 62 రవాణా నౌకలు

ABN , Publish Date - May 02 , 2026 | 06:04 AM

భారీ పెట్టుబడులతో నౌకారంగాన్ని శక్తివంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు రూ.51,383 కోట్లతో...

51వేల కోట్లతో కొత్తగా 62 రవాణా నౌకలు

న్యూఢిల్లీ, మే 1: భారీ పెట్టుబడులతో నౌకారంగాన్ని శక్తివంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దాదాపు రూ.51,383 కోట్లతో కొత్తగా 62 రవాణా నౌకలను సమకూర్చుకోనుంది. కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన మంత్రిత్వశాఖల సబ్‌కమిటీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. హోర్ముజ్‌ జలసంధి వద్ద పరిస్థితిని, దానివల్ల సముద్ర వాణిజ్య రవాణా మార్గాల్లో తలెత్తుతున్న ప్రతిబంధకాలను సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో దీర్ఘకాలిక అవసరాల రీత్యా రవాణానౌకల సంఖ్యను పెంచుకోవాలని నిర్ణయించారు. తద్వారా ఈ రంగం (షిప్పింగ్‌ ఫ్లీట్‌) సామర్థ్యాన్ని 2.85 మిలియన్‌ గ్రాస్‌ టన్నేజ్‌కు (జీటీ) పెంచవచ్చునని అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి..

మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు

భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌‌ను తోసిపుచ్చిన ఈసీ

Updated Date - May 02 , 2026 | 06:04 AM