గల్ఫ్‌కు కేంద్ర మంత్రులు
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:05 AM
యుద్ధం తాత్కాలికంగా ఆగినప్పటికీ భారత్‌లో ఇప్పట్లో చమురు ధరలు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో పశ్చిమాసియాపై కేంద్ర ప్రభుత్వం...
ఖతార్‌కు పురీ, యూఏఈకి జై శంకర్
న్యూఢిల్లీ, ఏప్రిల్9: యుద్ధం తాత్కాలికంగా ఆగినప్పటికీ భారత్‌లో ఇప్పట్లో చమురు ధరలు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో పశ్చిమాసియాపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురీ, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ గల్ఫ్ పర్యటనకు సిద్ధమయ్యారు. పురీ గురువారం ఖతార్‌కు బయలుదేరారు. రెండు రోజులు అక్కడే ఉంటారు. జై శంకర్ ఈనెల 11, 12 తేదీల్లో యూఏఈకు వెళ్లనున్నారు. ఎల్‌ఎన్‌జీ సరఫరాల పరిస్థితి గురించి పురీ ఖతార్ పాలకులతో చర్చలు జరుపుతారని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. మరోవైపు, ఇంధన భద్రత లక్ష్యంగా యూఏఈతో విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ చర్చలు జరపనున్నారు. గురువారం ఆయన మారిష్‌సకు బయలుదేరి వెళ్లారు. అక్కడినుంచి నేరుగా అరబ్ ఎమిరేట్స్‌కు జై శంకర్ చేరుకుంటారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స
ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం
Read Latest AP News And Telugu News