21 శాతం తగ్గిన రష్యన్ చమురు దిగుమతులు
ABN , Publish Date - May 01 , 2026 | 05:38 AM
రష్యా నుంచి భారత్‌కు ముడిచమురు దిగుమతులు 21శాతం తగ్గాయి. చమురు కొనుగోళ్లపై ఆంక్షల మినహాయింపును...
కమోడిటీ అనలిటిక్స్ సంస్థ కెప్లర్ వెల్లడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: రష్యా నుంచి భారత్‌కు ముడిచమురు దిగుమతులు 21శాతం తగ్గాయి. చమురు కొనుగోళ్లపై ఆంక్షల మినహాయింపును అమెరికా నెల రోజుల పాటు పొడిగించినప్పటికీ ఈ ఏడాది మార్చిలో జరిపిన రికార్డు స్థాయి కొనుగోళ్లతో పోలిస్తే ఏప్రిల్‌లో 4.2 లక్షల బ్యారెళ్ల తగ్గుదల నమోదైంది. ఈ మేరకు కమోడిటీ అనలిటిక్స్ సంస్థ కెప్లర్ గణాంకాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో రష్యాలోని ప్రధాన టెర్మినల్‌లో లోడింగ్ అంతరాయాల కారణంగా ఏప్రిల్‌లో రోజుకు 15.6 లక్షల బ్యారెళ్ల దిగుమతి మాత్రమే సాధ్యపడింది.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!
పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..