Share News

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు.. స్పందించిన విదేశాంగ శాఖ

ABN , Publish Date - Jul 17 , 2026 | 08:00 PM

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యంపై జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా తాజాగా చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.

బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు.. స్పందించిన విదేశాంగ శాఖ
MEO on Former Japan Minister Allegations

ఇంటర్నెట్ డెస్క్: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యంపై జపాన్ మాజీ మంత్రి హిడెకీ మకిహారా తాజాగా చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ వ్యాఖ్యలు మంత్రి వ్యక్తిగత అభిప్రాయమని భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఆ కామెంట్స్ వాస్తవాలను ప్రతిబింబించట్లేదని అన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు విషయంలో ఇరు దేశాల మధ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అన్నారు. నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టులో తొలి దశ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇక 2030 కల్లా జపాన్‌కు చెందిన ఈ10 సిరీస్ బుల్లెట్ రైళ్లు సరఫరా అవుతాయని ప్రభుత్వ వర్గాలు గతంలో పేర్కొన్నాయి.


షిన్‌కాన్సెన్ సాంకేతికతతో ప్లాన్ చేసిన ఈ రైలు ప్రాజెక్టు ముందు అనుకున్న దానికంటే భిన్నంగా ఉందని జపాన్‌కు చెందిన ఒక ఇంజినీర్ ఇటీవల స్థానిక పత్రికలో ఒక వ్యాసం రాశారు. దీనిపై జపాన్ మాజీ మంత్రి హిడెకీ స్పందిస్తూ ఓ భారతీయ మంత్రి, అధికారులు గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. స్వీయ ప్రయెజనాలకే పెద్ద పీట వేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సిగ్నలింగ్ వ్యవస్థ జపాన్‌కు దక్కలేదని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

భారతీయుల వల్లే బుల్లెట్ రైలు ప్రాజెక్టులో జాప్యం: జపాన్ మాజీ మంత్రి

130వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బ్రేక్‌..

Updated Date - Jul 17 , 2026 | 08:11 PM