Share News

ఇరాన్‌తో యుద్ధం.. భారత్ సహాయం కోరిన అమెరికా.. కేంద్రం స్పందన ఏంటంటే..

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:16 PM

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా భీకరంగా ప్రతిస్పందిస్తోంది. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ కేంద్రంగా పలు అసత్య వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ఇరాన్‌తో యుద్ధం.. భారత్ సహాయం కోరిన అమెరికా.. కేంద్రం స్పందన ఏంటంటే..
India MEA statement

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ మరింత తీవ్రమవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా భీకరంగా ప్రతిస్పందిస్తోంది. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను ఎదుర్కొనేందుకు అమెరికా.. భారత్ నుంచి సైనిక సహాయం కోరినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. అవి అసత్యాలని కొట్టిపడేసింది (India MEA statement).


ఇరాన్‌పై దాడులు చేసేందుకు వీలుగా పశ్చిమ భారత్‌లోని మిలిటరీ స్థావరాలను వాడుకుంటామని భారత్‌ను అమెరికా అడిగినట్టు కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. జాతీయ మీడియాలో కూడా ఈ అంశంపై కథనాలు వచ్చాయి. దీంతో విదేశాంగ శాఖ స్పందించి ఆ వార్తలకు చెక్ పెట్టింది. 'ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలు. అలాంటి అసత్యాలను నమ్మవద్దు. ఇలాంటి కల్పిత వార్తలపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుతున్నాం' అంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది (Military support claim false).


ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే భారత్‌ కేంద్రంగా పలు అసత్యాలు ప్రచారంలోకి వచ్చాయి (MEA clarification). భారత్ పోర్ట్‌లను అమెరికా వినియోగించుకుంటోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనా-75పై అమెరికా జలాంతర్గామితో దాడి చేసి ముంచేసింది. ఆ సమయంలోనే ఈ వార్తలు పుట్టుకొచ్చాయి. అవన్నీ అసత్య వార్తలేనని విదేశాంగ శాఖ వెంటనే ఖండించింది.


ఇవి కూడా చదవండి..

వారం రోజుల్లో ఆరు బ్యాంక్‌ల్లో చోరీ.. ఎంత దోచుకున్నాడో తెలిస్తే..


మీ చూపు పవర్‌ఫుల్ అయితే.. ఈ పూల మధ్యలో గంట ఎక్కడుందో 10 సెకెన్లలో కనుక్కోండి..

Updated Date - Mar 21 , 2026 | 04:19 PM