భారత్‌కు చేరిన ఎస్400 నాలుగో స్క్వాడ్రన్
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:37 AM
రష్యా అభివృద్ధి చేసిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాలుగో స్క్వాడ్రన్ భారత్‌కు చేరుకుంది. మొత్తం ఐదు స్క్వాడ్రన్ల ఎస్-400ల..
న్యూఢిల్లీ, జూన్ 3: రష్యా అభివృద్ధి చేసిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాలుగో స్క్వాడ్రన్ భారత్‌కు చేరుకుంది. మొత్తం ఐదు స్క్వాడ్రన్ల ఎస్-400ల కొనుగోలుకు భారతదేశం 2018లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకోగా.. వాటిలో మూడు స్క్వాడ్రన్లు 2023 ఫిబ్రవరి నాటికే అందాయి. మే నెలలో నాలుగో స్క్వాడ్రన్ కూడా చేరుకుంది. ఒప్పందం ప్రకారం ఇది 2023 చివర్లో లేదా 2024 ప్రారంభంలోనే రావాల్సి ఉంది. కానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆలస్యమైంది. ఐదో స్క్వాడ్రన్ 2027లో మనదేశానికి అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. యుద్ధ రంగంలో కీలక సమయాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి, ముంచుకొచ్చే ముప్పుల్లో ఏది అత్యంత ప్రమాదకరమైనదో ముందే గుర్తించడానికి ఉపకరించేలా ఈ ఎస్-400 వ్యవస్థలకు ఏఐ సాంకేతికతను జోడించనున్నట్టు వారు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..