Share News

భారత్‌కు నాలుగో ఎస్‌ 400

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:07 AM

రష్యా తయారీ కీలక గగనతల రక్షణ వ్యవస్థ ‘ఎస్‌-400’ మరో యూనిట్‌ వచ్చే నెలలో భారత్‌కు అందనుంది. రష్యా గతంలోనే మన దేశానికి మూడు ఎస్‌-400 వ్యవస్థలను...

భారత్‌కు నాలుగో ఎస్‌ 400

రష్యా నుంచి బయల్దేరిన గగనతల రక్షణ వ్యవస్థ కార్గో

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: రష్యా తయారీ కీలక గగనతల రక్షణ వ్యవస్థ ‘ఎస్‌-400’ మరో యూనిట్‌ వచ్చే నెలలో భారత్‌కు అందనుంది. రష్యా గతంలోనే మన దేశానికి మూడు ఎస్‌-400 వ్యవస్థలను సరఫరా చేసింది. తాజాగా నాలుగో వ్యవస్థను పంపింది. మే మధ్యనాటికి అది భారత్‌కు చేరుకుంటుంది. ఆ నెలాఖరుకల్లా అవసరమైన ప్రాంతంలో మోహరించే అవకాశం ఉందని రక్షణ వర్గాలు వెల్లడించాయి. పాక్‌ సరిహద్దులకు సమీపంలో రాజస్థాన్‌లో దీనిని మోహరించవచ్చని పేర్కొన్నాయి. ఐదో ఎస్‌-400 వ్యవస్థ నవంబర్‌ నాటికల్లా రానుందని తెలిపాయి. భారత్‌ వద్ద ఇప్పటికే ఉన్న మూడు ఎస్‌-400 వ్యవస్థల్లో ఒకటి పంజాబ్‌లో, మరొకటి గుజరాత్‌లో మోహరించారు. పాక్‌ నుంచి రక్షణ కోసం ఇవి పనిచేస్తున్నాయి. మూడోది చైనా నుంచి రక్షణ కోసం ఈశాన్య రాష్ట్రాలకు సమీపంలో మోహరించి ఉంది. రానున్న నాలుగో యూనిట్‌ను రాజస్థాన్‌లో, ఐదో యూనిట్‌ను చైనా నుంచి రక్షణ కోసం కీలక ప్రాంతాన్ని ఎంపిక చేసి మోహరించనున్నారు.

ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 06:07 AM