Share News

క్షిపణుల తయారీ బాధ్యతలు ప్రైవేట్‌కు!

ABN , Publish Date - Jul 13 , 2026 | 06:19 AM

దేశ రక్షణ రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అత్యాధునిక క్షిపణుల తయారీ, అభివృద్ధిలో ప్రైవేట్‌ సంస్థలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. దీనిలో..

క్షిపణుల తయారీ బాధ్యతలు ప్రైవేట్‌కు!

  • తొలిదశలో అస్త్ర మార్క్‌ 2, ఆ తర్వాత ‘ప్రళయ్‌’

  • త్వరలో ఆర్‌ఎ్‌ఫపీ జారీ చేయనున్న రక్షణ శాఖ

న్యూఢిల్లీ, జూలై 12: దేశ రక్షణ రంగంలో కీలక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అత్యాధునిక క్షిపణుల తయారీ, అభివృద్ధిలో ప్రైవేట్‌ సంస్థలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే అస్త్ర మార్క్‌ 2 మిస్సైల్‌ (180-200 కి.మీ. దూరం)ను తయారు చేయడానికి రక్షణ శాఖ త్వరలోనే రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎ్‌ఫపీ) జారీ చేయనుంది. ఇందులో ఐకామ్‌, టాటా గ్రూప్‌, అదానీ, మహీంద్రా, భారత్‌ ఫోర్జ్‌ తదితర ప్రముఖ భారతీయ కంపెనీలు పాల్గొనే అవకాశం ఉంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించడంతో పాటు దేశ సాయుధ దళాల అవసరాలు తీర్చడం, మిత్రదేశాల నుంచి పెరుగుతున్న ఎగుమతి డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్షిపణుల తయారీ బాధ్యతల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) ఈ డిమాండ్‌ను పూర్తిగా తీర్చలేకపోవడం కూడా ఓ కారణంగా కనబడుతోంది. తదుపరి దశలో బాలిస్టిక్‌ క్షిపణి ప్రళయ్‌ తయారీని కూడా ప్రైవేట్‌కు అప్పగించే యోచనలో కేంద్రం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Also Read:

ఫిరంగి కోసం పోరాటం

వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు

Updated Date - Jul 13 , 2026 | 06:19 AM