వాణిజ్య ఒప్పందంలో మార్పులు!
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:15 AM
అమెరికాలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంతో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందంలో కూడా మార్పులు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలని...
అమెరికా వాణిజ్య మంత్రి ఆకస్మిక రాక.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: అమెరికాలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంతో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందంలో కూడా మార్పులు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. మారిన పరిస్థితుల దృష్ట్యా అవసరమైతే వాణిజ్య ఒప్పందాన్ని ‘రీ బ్యాలెన్స్’ చేస్తామని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. శుక్రవారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టారి్‌ఫలపై అమెరికా నుంచి వస్తున్న సంకేతాలను గమనించి, ప్రయోజనాలను కాపాడుకునేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. గురువారం అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా, అనూహ్యంగా ఢిల్లీ వచ్చి గోయల్‌తో చర్చలు జరపడం గమనార్హం. రెండు దేశాల మధ్య కుదరాల్సిన వాణిజ్య ఒప్పందంలో మార్పుల కోసమే ఆయన వచ్చారన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. టారి్‌ఫల విఽధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఉన్న విస్తృత అధికారాలను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేయడం, అమెరికా-భారత్ ఒప్పందంపై చర్చలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో లుట్నిక్ పర్యటన జరగడం విశేషం. చర్చలు ఫలవంతమయ్యాయని గోయల్‌తో పాటు భారత్‌లో అమెరికా రాయబారి సెర్గిక్ గోర్ పేర్కొన్నారు.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ