దేశంలో కొత్తగా 74 ల్యాండ్ పోర్టులు
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:07 AM
సరిహద్దుల వెంబడి పొరుగు దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపర్చుకోవడం, భద్రతను బలోపేతం చేయడంపై భారత్ దృష్టి పెట్టింది....
చైనా సరిహద్దు వెంబడి మూడు.. పాక్ వెంబడి ఆరు
న్యూఢిల్లీ, జూన్ 12: సరిహద్దుల వెంబడి పొరుగు దేశాలతో వాణిజ్యాన్ని మెరుగుపర్చుకోవడం, భద్రతను బలోపేతం చేయడంపై భారత్ దృష్టి పెట్టింది. దీని కోసం అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కొత్తగా 74 భూమార్గ ఓడరేవు(ల్యాండ్ పోర్టు)లను నిర్మించాలని ప్రతిపాదించినట్టు ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎల్‌పీఏఐ) చైర్‌పర్సన్ జయంత్ సింగ్ తెలిపారు. వీటిలో మూడు చైనా సరిహద్దు వెంబడి, ఆరు పాకిస్థాన్ సరిహద్దు వెంబడి నిర్మించనున్నారు. సముద్ర తీరం లేని సరిహద్దు ప్రాంతాల్లో ఇతర దేశాల నుంచి రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా వాణిజ్యం(ఎగుమతులు, దిగుమతులు), ప్రయాణికుల రాకపోకలు సాగించే ప్రదేశాలను ల్యాండ్ పోర్టులు అంటారు. చైనా సరిహద్దు వెంబడి హిమాచల్ ప్రదేశ్‌లోని నామ్‌గియా, ఉత్తరాఖండ్‌లోని గుంజీ, సిక్కింలోని నాథూ లా వద్ద ల్యాండ్ పోర్టులు ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదించింది. పాకిస్థాన్ సరిహద్దుల్లో.. జమ్మూకశ్మీర్‌లోని టీట్‌వాల్, అదుసా, చక్కన్ దా బాగ్, పంజాబ్‌లోని అట్టారీ రైల్వేస్టేషన్, హుస్సేనీవాలా, రాజస్థాన్‌లోని మునాబావో రైల్వేస్టేషన్లలో ఈ పోర్టులు ఏర్పాటు చేయనున్నారు. భారత్‌లో ప్రస్తుతం 15 ల్యాండ్ పోర్టులు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. మరో 11 నిర్మాణ దశలో ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు
రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ
Read Latest TG News And Telugu News