పెన్షన్ ఫండ్‌లలో 100 శాతం ఎఫ్‌డీఐ
ABN , Publish Date - Apr 20 , 2026 | 06:44 AM
పెన్షన్ ఫండ్‌లలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం 49ు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది. అంటే...
యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం
వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: పెన్షన్ ఫండ్‌లలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం 49ు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి ఉంది. అంటే, యాజమాన్యం భారతీయ సంస్థల చేతుల్లో ఉంది. వంద శాతం అనుమతిస్తే ఈ రంగంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులతో వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాదే బీమా రంగంలోనూ వందశాతం ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించారు. పెన్షన్ రంగంలో అనుమతించడానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ (పీఎ్‌ఫఆర్‌డీఏ) చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. వచ్చే వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లు పెడతారని సమాచారం. 2004 నుంచి భారతీయ ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. అందులో ఉద్యోగులు, ప్రభుత్వం జమ చేసే సొమ్మును రెగ్యులేటరీ సంస్థ పీఎ్‌ఫఆర్డీఏ నిర్దేశించిన నిబంధలకు అనుగుణంగా పెట్టుబడులు పెడతారు. ఆ బాధ్యతను ప్రస్తుతం ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ లాంటి పెన్షన్ ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటిదాకా ఈ పెన్షన్ ఫండ్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో 49ు మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతిస్తున్నారు. పీఎ్‌ఫఆర్డీఏ చట్టాన్ని సవరించి 100ు అనుమతిస్తే విదేశీ పెన్షన్ ఫండ్ సంస్థలే నేరుగా భారతీయ సబ్సిడరీల ద్వారా ఎన్‌పీఎస్ నిధులను నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో