మే 1 నుంచి ఆన్‌లైన్ గేమింగ్ కొత్త నిబంధనలు
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:51 AM
దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్‌ను ప్రోత్సహించడానికి, నియంత్రించడానికి ఉద్దేశించిన చట్టం అమలుకు అవసరమైన నిబంధనలను...
నోటిఫై చేసిన కేంద్ర ఎలకా్ట్రనిక్స్, ఐటీ శాఖ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్ గేమింగ్‌ను ప్రోత్సహించడానికి, నియంత్రించడానికి ఉద్దేశించిన చట్టం అమలుకు అవసరమైన నిబంధనలను కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈమేరకు ‘ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ’ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. నిబంధనల అమల్లో వీలైనంత మేరకు సరళమైన విధానాన్ని అనుసరించాలని భావించినట్టు ఐటీ కార్యదర్శి ఎస్.కృష్ణన్ పేర్కొన్నారు. రియల్ మనీ గేమ్స్ (డబ్బుతో కూడిన గేమ్స్) కాని చాలా గేమ్స్‌కు రిజిస్ట్రేషన్ లేదా వర్గీకరణ తప్పనిసరికాదన్నారు. అయితే ఈస్పోర్ట్స్ గేమ్స్ మాత్రం చట్టప్రకారం కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు
సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు