డిజిటల్ కమ్యూనికేషన్‌లో ‘స్వదేశీ’ విప్లవం షురూ..!
ABN , Publish Date - Mar 23 , 2026 | 07:12 AM
విదేశీ కమ్యూనికేషన్ వేదికలకు ప్రత్యామ్నాయ వేదికలను సిద్ధం చేశామని అనువాదిని ఏఐ సీఈఓ డాక్టర్ బుద్దా చంద్రశేఖర్ తెలిపారు. డిజిటల్ కమ్యూనికేషన్స్‌లో...
విదేశీ వేదికలకు ప్రత్యామ్నాయంగా 2 యాప్‌లు
అనువాదిని ఏఐ సీఈఓ బుద్దా చంద్రశేఖర్
న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): విదేశీ కమ్యూనికేషన్ వేదికలకు ప్రత్యామ్నాయ వేదికలను సిద్ధం చేశామని అనువాదిని ఏఐ సీఈఓ డాక్టర్ బుద్దా చంద్రశేఖర్ తెలిపారు. డిజిటల్ కమ్యూనికేషన్స్‌లో స్వదేశీ విప్లవం ప్రారంభమైందని చెప్పారు. ఇప్పటి వరకు విదేశీ కమ్యూనికేషన్ వేదికలపై ఆధార పడ్డ 80 కోట్ల మంది భారతీయులకు అత్యంత సురక్షితమైన స్వదేశీ ప్రత్యామ్నాయం సిద్ధం చేశామని న్యూఢిల్లీలోని అంబేడ్కర్ భవన్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆత్మ నిర్భర్ స్ఫూర్తితో తమ సంస్థ రెండు అద్భుతమైన అప్లికేషన్లను రూపొందించిందన్నారు. ‘హైప్డ్ సంవాదిని’ మెసెంజర్, ‘దేశీ ఏఐ జెన్‌జీ కీబోర్ ్డ’లను ఆవిష్కరించి, వాటి పనితీరును చంద్రశేఖర్ వివరించారు. వీటి సాయంతో డిజిటల్ అరెస్టులు, ఉద్యోగాల పేరుతో జరుగుతున్న ఆర్థిక దోపిడీలను వీటితో ఆరికట్టవచ్చని తెలిపారు. విదేశీ యాప్‌ల్లో డేటా గోప్యత ప్రశ్నార్థకంగా మారుతోందన్న చంద్రశేఖర్.. తమ యాప్‌లతో పౌరుల వ్యక్తిగత సమాచారానికి రక్షణ కల్పిస్తున్నామన్నారు. ఇవి కేవలం కమ్యూనికేషన్ సాధనాలు మాత్రమే కాదని, జాతీయ భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. హైప్డ్ సంవాదినితో 22 భారతీయ భాషల్లో రియల్ టైమ్ అనువాదం చేయనున్నట్లు తెలిపారు. ఈ యాప్‌లతో సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చని, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి
ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు
ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప