ఆ టోల్ ప్లాజా వద్ద ఆగే పని లేదు!
ABN , Publish Date - May 02 , 2026 | 06:06 AM
దేశంలోనే తొలిసారిగా అవరోధం లేని టోల్ వ్యవస్థ(బారియర్ లెస్ టోల్ సిస్టమ్)ను గుజరాత్‌లో...
న్యూఢిల్లీ, మే 1: దేశంలోనే తొలిసారిగా అవరోధం లేని టోల్ వ్యవస్థ(బారియర్ లెస్ టోల్ సిస్టమ్)ను గుజరాత్‌లో సూరత్-భరుచ్ హైవేలోని చౌరాసి టోల్‌ప్లాజా వద్ద ప్రారంభించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరి శుక్రవారం ప్రకటించారు. జాతీయ రహదారి 48పై గల టోల్‌ప్లాజా వద్ద ఈ బహుళ వరుసల అవరోధం లేని టోల్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. ఆటోమెటిక్‌నెంబరు ప్లేట్ గుర్తింపు, ఫాస్టాగ్’లతో కూడిన ఈ అత్యాధునిక వ్యవస్థ ద్వారా టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగే పనిలేకుండానే టోల్ వసూలు పూర్తవుతుందని గడ్కరి తన ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది భారత టోల్ వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
మమతా బెనర్జీపై నిఘా ఉంచాం.. ఫోటో షేర్ చేసిన సువేందు
భవానీపూర్ హైడ్రామా.. ఓట్ ట్యాంపరింగ్‌ను తోసిపుచ్చిన ఈసీ