మాకు పోటీగా భారత్‌ను ఎదగనివ్వం
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:46 AM
అమెరికాకు వాణిజ్య పోటీదారుగా భారత్‌ను ఎదగనివ్వబోమని ఆ దేశ విదేశాంగ ఉప మంత్రి క్రిస్టోఫర్ లాండో న్నారు. 20 ఏళ్ల క్రితం చైనా విషయంలో చేసిన పొరపాట్లనే మళ్లీ చేయబోమన్న తెలిపారు...
చైనా విషయంలో చేసిన పొరపాట్లను చేయం: అమెరికా భారతదేశ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు: జైశంకర్ అమెరికా వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి: చైనా
భారత్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కౌంటర్
న్యూఢిల్లీ, మార్చి 7: అమెరికాకు వాణిజ్య పోటీదారుగా భారత్‌ను ఎదగనివ్వబోమని ఆ దేశ విదేశాంగ ఉప మంత్రి క్రిస్టోఫర్ లాండో న్నారు. 20 ఏళ్ల క్రితం చైనా విషయంలో చేసిన పొరపాట్లనే మళ్లీ చేయబోమన్న తెలిపారు. వార్షిక ప్రాంతీయ రాజకీయ చర్చా వేదిక ‘రైసినా డైలాగ్-2026’ ఆయన మాట్లాడారు. ‘అమెరికా స్వచ్ఛంద సంస్థ కాదు. భారత్ ఒక విషయం అర్ధం చేసుకోవాలి. 20 ఏళ్లక్రితం చైనా విషయంలో చేసిన పొరపాట్లనే మళ్లీ చేసి, అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ మాకు పోటీగా ఎదిగే అవకాశం ఇవ్వబోము. నాడు చైనాకు మా మార్కెట్లను స్వేచ్ఛగా వాడుకొనే అవకాశం ఇచ్చినందుకే నేడు అది మాకు పోటీదారుగా మారింది. మేం ఏం చేసినా మా ప్రజల కోసమే చేస్తాం. ఎందుకంటే అంతిమంగా మేం అమెరికా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. భారత ప్రభుత్వం భారత ప్రజలకు జవాబుదారీగా ఉన్నట్లుగానే..’ అని పేర్కొన్నారు. క్రిస్టోఫర్ వ్యాఖ్యాలకు అదే వేదికపై నుంచి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం కౌంటర్ ఇచ్చారు. ‘భారత ప్రగతిని ఎవరూ ఆపలేరు. ఎవరో చేసే పొరపాట్లపై మనదేశ అభివృద్ధి ఆధారపడి లేదు. భారతదేశ అభివృద్ధి భారత్ చేతిలోనే ఉంది. ఆ మాటకొస్తే ఏ దేశ అభివృద్ధి ఆ దేశం చేతిలోనే ఉంటుంది. భారత్‌కు సవాళ్లు లేవని చెప్పను. కానీ, అభివృద్ధి విషయంలో భారత్‌కు లక్ష్యాలు, మార్గం ఉన్నాయి’ అని అమెరికా పేరెత్తకుండానే ఆ దేశానికి చురకలంటించారు.
లాండో వ్యాఖ్యలు హాస్యాస్పదం: చైనా
లాండో వ్యాఖ్యలపై చైనా కూడా ఘాటుగా స్పందించింది. ఆయన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించింది. ‘అమెరికా అనుమతితోనే చైనా అభివృద్ధి చెందిందా? భారత్ అభివృద్ధి చెందటానికి అమెరికా అనుమతి ఇవ్వదా? అమెరికా ప్రకటన చాలా అయోమయంగా ఉంది’ అని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎద్దేవా చేసింది. అమెరికా మంత్రి వ్యాఖ్యలపై మనదేశంలో ప్రతిపక్ష పార్టీలు, మేధావులు విమర్శలు గుప్పిస్తున్నారు.
భారత్‌ను అమెరికా
బలహీనపర్చే ప్రమాదం
అభివృద్ధి విషయంలో అమెరికాతో భారత్ జాగ్రత్తగా వ్యవహరించాలని ఆ దేశ ఆర్థికవేత్త జఫ్రీ శాక్స్ సూచించారు. అమెరికాకు భారత్ నిజంగానే వాణిజ్య పోటీదారుగా ఎదిగి, శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందితే.. కచ్చితంగా ఆ దేశాన్ని బలహీనపర్చేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని అన్నారు. అమెరికా కామెంటేటర్ టకర్ కార్ల్‌సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శాక్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్ ఏదో ఒకరోజు విజయవంతమైతే.. అప్పుడు దానిని బలహీనపర్చేందుకు అమెరికా ప్రయత్నిస్తుంది. రష్యా, చైనాలు శక్తిమంతమైన దేశాలుగా ఎదిగినందువల్లే ఆ దేశాలను అమెరికా వ్యతిరేకిస్తోంది. భారత్ విషయంలో కూడా అదే జరుగుతుంది’ అని అన్నారు. అది త్వరలోనే జరిగే అవకాశం ఉందని టకర్ బదులిచ్చారు. చైనాను నిలువరించేందుకు భారత్‌ను అమెరికా వాడుకొంటోందని, ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలని సాచ్ సూచించారు. కాగా, మరో 10-15 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉందని, ఈ శతాబ్దం చివరి నాటికి అమెరికాను కూడా వెనక్కు నెట్టి మొదటిస్థానంలోకి వెళ్తుందని శాక్స్ గతంలో అంచనా వేశారు.
ఇవి కూడా చదవండి..
ఇకపై దాడులు చేయం... గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ