మధ్య ప్రాచ్యంలో పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నాం: పౌర విమానయాన శాఖ
ABN , Publish Date - Mar 02 , 2026 | 09:49 PM
మధ్య ప్రాచ్యంలోని పరిస్థితులను నిరంతరం గమనిస్తున్నామని పౌర విమానయాన శాఖ తెలిపింది. విమాన సర్వీసులు ఇతర వివరాలకు సంబంధించిన వివరాల కోసం ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్య ప్రాచ్యంలోని పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నామని భారత పౌర విమానయాన శాఖ తాజాగా వెల్లడించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 357 విమాన సర్వీసులు రద్దయ్యాయని తెలిపింది. విమానాల రద్దుతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల కోసం ఇప్పటికే ప్యాసింజర్ అసిస్టెన్స్ కంట్రోల్ రూమ్ (పీఏసీఆర్) అందుబాటులో ఉందని తెలిపింది. నేడు 559 ప్రయాణికుల ఫిర్యాదులను పరిష్కరించామని చెప్పింది. వివిధ ఎయిర్‌లైన్స్, ఎయిర్‌పోర్టు ఆపరేటర్లను సమన్వయ పరుస్తూ ప్రయాణికుల సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడించింది.
ప్రయాణికులకు సమయానికి సహాయం అందేలా కృషి చేస్తున్నామని పౌర విమానయాన శాఖ తెలిపింది. విమాన సర్వీసు రద్దు, రీషెడ్యూల్ వివరాల కోసం ప్యాసింజర్లు అధికారిక ఎయిర్‌లైన్స్ సమాచార వేదికలనే చూడాలని కూడా విజ్ఞప్తి చేసింది. 011-24604283, 011-24632987 పీఏసీఆర్ హెల్ప్‌లైన్ నెంబర్లలో ప్రయాణికులు సంప్రదించవచ్చని పేర్కొంది. ఎయిర్ సేవ, సోషల్ మీడియా ద్వారా అందుతున్న ఫిర్యాదులను కూడా వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నట్టు వెల్లడించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులను సమీక్షిస్తూ తగు నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎయిర్‌లైన్స్ సంస్థలు కూడా ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి..
నాటాంజ్ అణుక్షేత్రంపై యూఎస్, ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ రాయబారి సంచలన ప్రకటన
సౌదీలోని అతిపెద్ద రిఫైనరీపై ఇరాన్ దాడి.. వీడియో వైరల్