అదనపు ఇథనాల్‌ను ఏం చేద్దాం?
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:20 AM
పెట్రోల్‌లో 20% ఇథనాల్ బ్లెండింగ్ కోసం కేంద్రం వేగంగా అడుగులు వేసింది. నిర్దేశించుకున్న దానికంటే ఐదేళ్ల ముందే ఇ-20 లక్ష్యాన్ని చేరుకుంది....
700 కోట్ల లీటర్ల అదనపు ఉత్పత్తి సామర్థ్యం ఉందన్న ఏఐడీఏ
న్యూఢిల్లీ, జూలై 16: పెట్రోల్‌లో 20% ఇథనాల్ బ్లెండింగ్ కోసం కేంద్రం వేగంగా అడుగులు వేసింది. నిర్దేశించుకున్న దానికంటే ఐదేళ్ల ముందే ఇ-20 లక్ష్యాన్ని చేరుకుంది. ఇక్కడి వరకూ బాగానే ఉన్నా ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది. ఆ సమస్య వాహనాల వల్ల వచ్చింది కాదు.. ఇబ్బడి ముబ్బడిగా ఉత్పత్తి అవుతున్న ఇథనాల్ గురించి. ఇ-20 పెట్రోల్ అమ్మకాలను ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటికీ, డిమాండ్-సప్లయ్ మధ్య అసమతుల్యత భారీగా ఉంది. అదనపు ఉత్పత్తిని ఏమి చేయాలని పరిశ్రమలు ప్రశ్నిస్తుంటే, ప్రభుత్వం మాత్రం ఎగుమతుల గురించి మాట్లాడుతోంది. ప్రస్తుతం దేశంలో 370 డిస్టిల్లరీస్ ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తుండగా, మరో 40 ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని ఆలిండియా డిస్టిల్లరీస్ అసోసియేషన్ (ఏఐడీఏ) పేర్కొంది. 2 వేల కోట్ల లీటర్ల ఉత్పత్తి సామర్థ్యం ఆ ప్లాంట్లకు ఉందని వెల్లడించింది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (ఈబీపీ) కార్యక్రమం, ఇతర పరిశ్రమల అవసరాలకు పోను ఇంకా 700 కోట్ల లీటర్ల ఇథనాల్ మిగిలిపోతుందని ఆ సంస్థ వెల్లడించింది. అయితే ఈబీపీకి ఏటా 1,200 కోట్ల లీటర్ల ఇథనాల్ సరిపోతుందని ఓ నివేదిక స్పష్టం చేసింది. దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అవసరానికి మించి ఎక్కువ ఉత్పత్తి చేసే ప్లాంట్లు ఉన్నాయి. ఒకవేళ వాటి ఉత్పాదక సామర్థ్యానికి మించి తక్కువ ఉత్పత్తి చేస్తే పెట్టుబడిని తిరిగి రాబట్టుకోగలవా? అనే ప్రశ్న తలెత్తుతోంది. అవసరానికి మించి ఏర్పాటైన ప్లాంట్లను ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఇథనాల్‌ను ఎక్కువగా కలిపి వాడగలిగే వాహనాలను ఇప్పడు ప్రవేశపెట్టాల్సి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక