భారత్‌లో ఉన్న విదేశీయులకు వీసా పొడిగింపు
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:37 AM
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో విమాన రాకపోకలపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇండియా ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల వీసాలతో...
న్యూఢిల్లీ, మార్చి 14: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో విమాన రాకపోకలపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇండియా ఓ కీలకమైన నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల వీసాలతో మన దేశానికి వచ్చిన విదేశీయుల వీసా గడువును నెలరోజుల పాటు పొడిగించింది. గడువు ముగిసిన వారిపై ఎటువంటి అపరాధ రుసుము విధించకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసె్‌స(ఎ్‌ఫఆర్‌ఆర్‌ఓలు) తమ పరిధిలో ఉంటున్న విదేశీయుల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి ఈమేరకు నిర్ణయం తీసుకుంటాయి. ఫిబ్రవరి 28, 2026 తరువాత యుద్ధ ప్రభావానికి గురైన విదేశీయులకు ఈ మినహాయింపులు వర్తిస్తాయని దుబాయ్‌లోని భారతీయ కాన్సులేట్ జనరల్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. అలాగే పశ్చిమ ఆసియా గగనతంలో ఏర్పడిన అంతరాయాల కారణంగా భారత్‌కు మళ్లించిన విమానాల్లోని విదేశీ పౌరులకు తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్లు(టీఎల్‌పీ) ఉచితంగా మంజూరు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే