యూజర్‌నేమ్ ఫీచర్ వివాదం.. మెటాకు మూడు రోజుల గడువు పెంపు..
ABN , Publish Date - Jul 06 , 2026 | 07:44 PM
వివాదాస్పద 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై వాట్సాప్ యాప్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్‌కు జారీ చేసిన నోటీసులపై స్పందించి, వివరణ ఇచ్చేందుకు కేంద్రం అదనపు సమయాన్ని ఇచ్చింది.
ఢిల్లీ: వివాదాస్పద 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై వాట్సాప్ యాప్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వాట్సాప్‌కు జారీ చేసిన నోటీసులపై స్పందించి, వివరణ ఇచ్చేందుకు కేంద్రం అదనపు సమయాన్ని ఇచ్చింది. మూడు రోజుల పాటు అదనపు సమయాన్ని కేటాయించింది. గత శుక్రవారం నాటికి కేంద్రానికి వాట్సాప్ వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే, అదే రోజు వాట్సాప్ మాతృసంస్థ మెటా నుంచి ఓ బృందం ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులను కలిసింది.
తమకు అదనపు సమయం కావాలని కోరగా మరో మూడు రోజులు పొడిగించారు. అయితే, చర్చలు పూర్తయ్యే వరకూ భారత్‌లో ఆ ఫీచర్‌ను ప్రవేశపెట్టొద్దని తేల్చి చెప్పారు. కాగా, యూజర్‌నేమ్ ఫీచర్‌తో మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లోని వ్యక్తులు తమ ఫోన్ నంబర్లను ఇతరులతో పంచుకోకుండానే ఒకరితో మరొకరు సంభాషించే అవకాశం ఉంటుంది. దీనిపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఫీచర్ వల్ల ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, డిజిటల్ అరెస్ట్, స్కామ్‌లు, నకిలీ గుర్తింపు దాడులు వంటివి గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు గత బుధవారం నాడు మెటాకు నోటీసులు జారీ చేసింది.
సైబర్ నేరాలను పెంచే అవకాశం ఉన్న వాట్సాప్ కొత్త ఫీచర్‌పై ఐటీ చట్టం, నిబంధనల కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని కేంద్రం ఆ నోటీసులో మెటాను కోరింది. ఈ విషయంపై ప్రభుత్వం సంతృప్తి చెందే వరకూ ఫీచర్‌ను భారత్‌లో నిలిపివేయాలని ఆదేశించింది. మరోవైపు, యూజర్‌నేమ్ ఫీచర్‌ను ఈ ఏడాది చివరిలో భారత్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ ప్రకటించింది.
ఈ వార్తలు కూడా చదవండి
భారత్ - బహామాస్ కీలక దౌత్య ఘట్టం ఆవిష్కృతం
పహల్గాం దాడి.. పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌పై కేసు