ఇళ్లు, ఆస్పత్రులు, బడులకు గ్యాస్ కొరత లేదు
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:44 AM
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యా్‌సకు డిమాండ్ అమాంతం పెరిగిందని శుక్రవారం కేంద్రప్రభుత్వం అంగీకరించింది. అయినప్పటికీ వంట గ్యాస్ పంపిణీలో...
సీఎన్‌జీకి లోటు లేదు..వాణిజ్య సిలిండర్ల బాఽధ్యత రాష్ట్రాలకు
పీఎన్‌జీ కనెక్షన్ ఉంటే గ్యాస్ సిలిండర్ రద్దు: కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ, మార్చి 14: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యా్‌సకు డిమాండ్ అమాంతం పెరిగిందని శుక్రవారం కేంద్రప్రభుత్వం అంగీకరించింది. అయినప్పటికీ వంట గ్యాస్ పంపిణీలో ఇబ్బంది లేదని భరోసా ఇచ్చింది. దేశీయంగా వంట గ్యాస్ ఉత్పత్తి 30శాతం మేర పెంచినట్లు తెలిపింది. శనివారం పెట్రోలియం, సహజవాయువుల శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ మీడియాతో మాట్లాడుతూ గృహ అవసరాల కోసం 100ు మేర గ్యాస్‌ను అందజేస్తామని భరోసా ఇచ్చారు. అయితే వాణిజ్య సిలిండర్ల కొరత ఉండడంతో హోటళ్లు, ఆహార పరిశ్రమ ఇబ్బందులు పడుతోందని అంగీకరించారు. అందువల్ల వాణిజ్య సిలిండర్ల బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించామని చెప్పారు. ప్రాధాన్య క్రమంలో అవి పంపిణీ చేస్తాయని తెలిపారు. ఆస్పత్రులు, విద్యా సంస్థలకు వంట గ్యాస్‌ను అందజేస్తామని ప్రకటించారు. ఇక, ఇళ్లకు పైపుల ద్వారా సరఫరా అయ్యే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), వాహనాలకు వినియోగించే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)ల సరఫరాకు ఎలాంటి అంతరాయాలు లేవని సుజాతా శర్మ తెలిపారు. పీఎన్‌జీ కనెక్షన్ ఉన్న వారికి గ్యాస్ సిలిండర్‌ను రద్దు చేస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఇంటికి రెండు కనెక్షన్లు ఉండాల్సిన అవసరం లేదని భావించి సిలిండర్ కనెక్షన్‌ను రద్దు చేసింది. పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నవారు గ్యాస్ సిలిండర్లకు అనర్హులని తెలిపింది.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే