విద్యార్థుల డిమాండ్స్‌కు పూర్తి మద్దతు ఇస్తున్నాం: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Jul 23 , 2026 | 10:24 PM
నీట్ పేపర్ లీక్ బాధ్యులపై చర్యలు కోరుతూ ఉద్యమిస్తున్న విద్యార్థులకు ప్రతిపక్ష కూటమి (INDIA Alliance) పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ పేపర్ లీక్ బాధ్యులపై చర్యలు కోరుతూ ఉద్యమిస్తున్న విద్యార్థులకు ప్రతిపక్ష కూటమి (INDIA Alliance) పూర్తి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. విద్యారంగంలో సంస్కరణలు కోరుతున్న విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో నేడు సమావేశమైన కూటమి నేతలు ఈ మేరకు నిర్ణయించారు. విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత కూటమి నేతలు గాంధీ స్మృతి కేంద్రం వద్దకు చేరుకొని కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.
రాహుల్ గాంధీ నివాసంలో సమావేశం అనంతరం బస్సుల్లో గాంధీ స్మృతి కేంద్రానికి బయలుదేరిన విపక్ష నేతలను పోలీసులు కాసేపు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కొంత సేపు ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఆ తరువాత రాహుల్ గాంధీ సారథ్యంలో విపక్ష నేతలు గాంధీ స్మృతి కేంద్రానికి వెళ్లి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుతో ఏ ప్రయోజనం ఉండదని ఆ పార్టీ ప్రతినిధి పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
నేటి తరానికి ఓపిక తక్కువ.. హనీమూన్ మర్డర్ కేసులో సుప్రీం కోర్టు వ్యాఖ్య
మోదీ జీ.. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి.. లేదంటే..: అభిజీత్ దీప్కే