Share News

మోదీ జీ.. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి.. లేదంటే..: అభిజీత్ దీప్కే

ABN , Publish Date - Jul 23 , 2026 | 07:23 PM

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని ప్రధాని మోదీని కాక్రోచ్ జనతా పార్టీ ప్రెసిడెంట్ అభిజీత్ దీప్కే గురువారం మరోసారి కోరారు.

మోదీ జీ.. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి.. లేదంటే..: అభిజీత్ దీప్కే
Abhijeet Dipke

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని ప్రధాని మోదీని కాక్రోచ్ జనతా పార్టీ ప్రెసిడెంట్ అభిజీత్ దీప్కే గురువారం మరోసారి కోరారు. కేంద్రం స్పందించని పక్షంలో ఈ రాజీనామాల పర్వం ప్రధాని మోదీ వరకూ చేరుతుందని వ్యాఖ్యానించారు. ‘మోదీ జీ.. మిమ్మల్ని మరోసారి అభ్యర్థిస్తున్నా.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించండి. లేకపోతే ఇది ఆయన రాజీనామాకే పరిమితం కాదు. మీ రాజీనామా వరకూ వస్తుంది’ అని అన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్‌కు కేంద్రం ఇంకా ఎందుకు అండగా ఉంటోందని అభిజీత్ దీప్కే ప్రశ్నించారు. ‘దేశంలోని కోట్ల మంది విద్యార్థుల కంటే ఒక విఫల, అసమర్థ మంత్రి ఎక్కువ కాదు కదా? ఒక వేళ మంత్రే ముఖ్యమని భావిస్తే దేశంలో మీకెవరూ ఓటు వేయబోరన్న విషయాన్ని మర్చిపోవద్దు’ అని అన్నారు.


నీట్‌ పేపర్‌ లీక్‌పై చర్చకు కేంద్రం మరోసారి ఆహ్వానించగా సీజేపీ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఎలాంటి చర్చైనా జంతర్‌మంతర్ వద్ద లేదా మరో తటస్థ వేదికపై జరగాలని సీజేపీ స్పష్టం చేసింది. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్న ప్రధాని ప్రకటనపై కూడా సీజేపీ ప్రతినిధి స్పందించారు. ఇలాంటి ప్రకటనలతో ఏ ప్రయోజనం ఉండదని అన్నారు. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మినహా తాము మరొకటి ఆశించట్లేదని స్పష్టం చేశారు.


ఈ వార్తలనూ చదవండి:

రేపు దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు

సీజేపీ ఆందోళనలు.. వారి పాస్‌పోర్ట్‌లు రద్దు చేసే అవకాశం!

Updated Date - Jul 23 , 2026 | 07:33 PM