Share News

రేపు దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:31 PM

నీట్‌ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ జులై 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.

రేపు దేశవ్యాప్త నిరసనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు
Cockroach Janata Party Nationwide Protest

ఇంటర్నెట్ డెస్క్: నీట్‌ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జులై 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఇటీవలి జంతర్‌మంతర్-పార్లమెంటు ర్యాలీ సందర్భంగా యువతపై పోలీసుల కర్కశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసనకు పిలుపునిచ్చినట్టు తెలిపింది. ఈ కార్యక్రమానికి కావాల్సిన అనుమతులు, ఇతర ఏర్పాట్లకు సిద్ధం కావాలని యువతను కోరింది. పేపర్ లీక్‌ అంశంపై చర్చకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ మరో నిరసన కార్యక్రమానికి సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.


ఈ నిరసన కార్యక్రమానికి కావాల్సిన అనుమతులు పొందేందుకు, ఏర్పాట్లు చేసేందుకు విద్యార్థి సంఘాలు, యూత్ ఆర్గనైజేషన్లు కలిసి పనిచేయాలని సీజేపీ పిలుపునిచ్చింది. నీట్ పేపర్ లీక్ అంశంలో సీజేపీ డిమాండ్స్‌ గురించి ఈ నిరసనల్లో బహిరంగంగా చదవాలని పేర్కొంది. బాధితులకు సంఘీభావంగా ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతాకీ జై వంటి నినాదాలు చేయాలని కూడా సూచించింది. నిరసనల్లో కేవలం సానుకూల నినాదాలను మాత్రమే చేయాలని చెప్పింది. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొంది. నిరసనకు అనుమతి ఉన్న ప్రాంతాలకే పరిమితం కావాలని, ట్రాఫిక్‌కు ఆటంకాలు లేకుండా చూసుకోవాలని సూచించింది. రెచ్చగొట్టే చర్యలకు స్పందించవద్దని కూడా పేర్కొంది.


ఇక నీట్‌ ఉదంతంపై విచారణ కోసం కేంద్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.

ఈ వార్తలనూ చదవండి:

ఇన్‌స్టా స్టోరీలో 'కాక్రోచ్' పోస్ట్.. వివాదంలో ఆర్ఏఎఫ్ ఆఫీసర్ సోనియా!

ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ నిరసన.. వాంగ్‌చుక్ భార్య విమర్శలు

Updated Date - Jul 23 , 2026 | 06:45 PM