జేఈఈ అడ్వాన్స్‌డ్ డేటా లీక్ నిజమే: ఐఐటీ రూర్కీ
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:56 AM
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల వెబ్‌సైట్‌లో క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో సమస్య తలెత్తిన విషయం నిజమేనని ఐఐటీ రూర్కీ అంగీకరించింది. ఈ లోపం వల్ల...
న్యూఢిల్లీ, జూన్ 3: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల వెబ్‌సైట్‌లో క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో సమస్య తలెత్తిన విషయం నిజమేనని ఐఐటీ రూర్కీ అంగీకరించింది. ఈ లోపం వల్ల దాదాపు 1.79 లక్షల మంది విద్యార్థుల డేటా బహిర్గతమైంది. సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడైన రైలెన్ అనిల్ అనే 16 ఏళ్ల యువకుడు ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించి ‘ఎక్స్’ వేదికగా వెల్లడించగా.. ఈ ఏడాది పరీక్ష నిర్వహించిన ఐఐటీ రూర్కీ స్పందించి ఆ తప్పును అంగీకరించింది. అయితే లీకైన డేటా ‘రీడ్ ఓన్లీ’ మోడ్‌లో ఉండడం వల్ల ఎవరూ వాటిని మార్పులు చేయడానికి అవకాశం లేదని ఐఐటీ రూర్కీ పేర్కొంది. ఈ లోపాన్ని సరిచేసేందుకు అత్యవసర ప్రాతిపదికన చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ లోపాన్ని గుర్తించి తెలియజేసినందుకు యువ పరిశోధకుడు రైలెన్ అనిల్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఇవి కూడా చదవండి:
బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..