Share News

అడ్మిషన్‌ ఇవ్వలేదని.. ఐఐటీ కాన్పూర్‌ వెబ్‌సైట్‌ హ్యాక్‌

ABN , Publish Date - Jul 31 , 2026 | 05:47 AM

సైబర్‌ సెక్యూరిటీ కోర్సులో ఓ విద్యార్థికి అడ్మిషన్‌ ఇవ్వడానికి ఐఐటీ కాన్పూర్‌ నిరాకరించగా.. అతడు ఏకంగా ఆ సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసేశాడు. విద్యార్థి సత్తాను ఒప్పుకున్న...

అడ్మిషన్‌ ఇవ్వలేదని.. ఐఐటీ కాన్పూర్‌ వెబ్‌సైట్‌ హ్యాక్‌

కాన్పూర్‌, జూలై 30: సైబర్‌ సెక్యూరిటీ కోర్సులో ఓ విద్యార్థికి అడ్మిషన్‌ ఇవ్వడానికి ఐఐటీ కాన్పూర్‌ నిరాకరించగా.. అతడు ఏకంగా ఆ సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసేశాడు. విద్యార్థి సత్తాను ఒప్పుకున్న విద్యాసంస్థ అతడికి మరో అవకాశం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఐఐటీ కాన్పూర్‌లో బీటెక్‌ సైబర్‌ సెక్యూరిటీ కోర్సు అడ్మిషన్‌ కోసం సదరు విద్యార్థి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ కోర్సులో సీటు రావాలంటే హ్యాకథాన్‌లో పాల్గొని నైపుణ్యాలను నిరూపించుకోవాలి. కానీ ఆ విద్యార్థి హ్యాకథాన్‌కు కూడా సెలక్ట్‌ కాలేదు. సీటు సాధించాలన్న పట్టుదలతో అతడు విద్యాసంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసి, ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీనిపై స్పందించిన ఐఐటీ కాన్పూర్‌ విద్యార్థిపై కేసు పెట్టకుండా..నైపుణ్యాలను నిరూపించుకోవడానికి క్యాంప్‌సకు రావాలని ఆహ్వానించింది.

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 05:47 AM