ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్‌పై కారు డ్రైవర్ కాల్పులు
ABN , Publish Date - Nov 21 , 2026 | 09:45 PM
హరిద్వార్‌లో (ఉత్తరాఖండ్) ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి సీపీ నౌటియాల్‌పై ఆయన డ్రైవర్ కాల్పులు జరపడం కలకలానికి దారి తీసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి సీపీ నౌటియాల్‌పై ఆయన డ్రైవర్ కాల్పులు జరపడం హరిద్వార్‌లో (ఉత్తరాఖండ్) కలకలానికి దారి తీసింది. నిందితుడిని వినోద్ నేగీగా గుర్తించారు. శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో గాయపడ్డ ఐబీ అధికారిని తొలుత స్థానిక ఆసుపత్రికి తరలించి అటుపై మెరుగైన చికిత్స కోసం ఎయిమ్స్ రిషీకేష్‌లో చేర్చారు.
ఖంఖాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, తూటా ఆయన నుదురును తాకుతూ వెళ్లడంతో పెనుప్రమాదం తప్పినప్పటికీ తలకు తీవ్ర గాయమైంది. నిందితుడు ఎందుకు కాల్పులు జరిపాడో ఇంకా తెలియరాలేదు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, పని ఒత్తిడి కారణంగా డ్రైవర్ నేగీ కాల్పులు జరిపాడని సమాచారం.
ఈ ఉదంతంపై స్థానిక ఎస్ఎస్‌పీ అధికారి నవనీత్ సింగ్ భుల్లార్ మాట్లాడుతూ నేగీ తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్‌గా చేస్తున్నట్టు తెలిపారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేశామని చెప్పారు. నిందితుడు అక్రమంగా తెచ్చుకున్న తుపాకీతో నౌటియాల్‌పై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో, నిందితుడికి ఆయుధం ఎలా లభించిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అనిరుధ్, కావ్య పెళ్లి రిసెప్షన్.. రజినీ కాంత్, కమల్ హాసన్, విజయ్, రేవంత్ హాజరు
తాజ్‌ను సందర్శించవచ్చు.. పాక్ మంత్రికి అనుమతి