మధ్యప్రదేశ్‌లో ఐఏఎస్, ఐపీఎస్‌ల భూమాయ!
ABN , Publish Date - May 12 , 2026 | 05:07 AM
మధ్యప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేసిన ఒక భూమి వ్యవహారం ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ‘దైనిక్ భాస్కర్’ పత్రిక కథనం ప్రకారం....
5 ఎకరాల భూమిని ఉమ్మడిగా కొన్న 41మంది అధికారులు
మరుసటి ఏడాదే ఆ భూమి దగ్గర నుంచి బైపాస్ ప్రాజెక్టు
కొనుగోలుదారుల్లో తెలంగాణ క్యాడర్ అధికారులు కూడా
భోపాల్, మే 11: మధ్యప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేసిన ఒక భూమి వ్యవహారం ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ‘దైనిక్ భాస్కర్’ పత్రిక కథనం ప్రకారం.. 41 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉమ్మడిగా భోపాల్ నగరానికి దగ్గరలోని కోలార్ ఏరియా గురాడి ఘాట్ గ్రామంలో 2022 ఏప్రిల్ 4వ తేదీన ఒకేరోజున 5 ఎకరాల వ్యవసాయ భూమిని సింగిల్ రిజిస్ట్రీ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేశారు. వీరిలో తెలంగాణ, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర క్యాడర్లకు చెందినవారు ఉన్నారు. ఇది జరిగిన 17 నెలల తర్వాత.. 2023 ఆగస్టు 31న మధ్యప్రదేశ్ క్యాబినెట్ రూ.3,200 కోట్ల విలువైన పశ్చిమ బైపాస్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ బైపాస్ అలైన్‌మెంట్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేసిన భూమికి కేవలం 500 మీటర్ల దూరం నుంచి వెళ్తోంది. కొన్నప్పుడు రూ.7.78 కోట్లుగా ఉన్న భూమి మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.65 కోట్లకు పెరిగింది. కేవలం నాలుగేళ్లలో దాదాపు 9 రెట్ల లాభం. ఈ వ్యవహారం మధ్యప్రదేశ్‌లో తీవ్ర దుమారం రేపింది. బైపాస్ అలైన్‌మెంట్ గురించి సమాచారం ముందే తెలుసుకొని అధికారులు వ్యవసాయ భూమిని కొన్నారని, ధరలు పెరిగాక అమ్మటం కోసమే ఈ పెట్టుబడి పెట్టారని, ఇది అధికార దుర్వినియోగం కిందికి వస్తుందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్