Share News

హైదరాబాద్‌ నుంచి వెళ్లిన 156 మంది

ABN , Publish Date - Aug 27 , 2026 | 05:41 AM

హైదరాబాద్‌ నుంచి నేపాల్‌కు ఇటీవల ఒక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ద్వారా సుమారు 156 మంది వెళ్లినట్టు తెలిసింది. అందులో 77 మంది ఈశా ఫౌండేషన్‌కు...

హైదరాబాద్‌ నుంచి వెళ్లిన 156 మంది

  • ఈషా బృందం కో-ఆర్డినేటర్‌

  • అఖిలేశ్వరన్‌ సహా పలువురు గల్లంతు

  • ఆదోని నుంచి వెళ్లిన నలుగురు కూడా..

  • తెలంగాణవారి కోసం హెల్ప్‌లైన్‌

హైదరాబాద్‌ సిటీ/చెన్నై/ఆదోని, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నుంచి నేపాల్‌కు ఇటీవల ఒక ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ద్వారా సుమారు 156 మంది వెళ్లినట్టు తెలిసింది. అందులో 77 మంది ఈశా ఫౌండేషన్‌కు చెందినవారు. ఈ బృందానికి కో-ఆర్డినేటర్‌గా ఉన్న డాక్టర్‌ అఖిలేశ్వర్‌ తెలుగువారుకాగా, బృందంలో చాలా మంది విదేశీయులు ఉన్నారని సమాచారం. వరదల్లో చిక్కుకున్న ఈ బృందంలోని అఖిలేశ్వర్‌ సహా చాలా మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ బృందం కాకుండా హైదరాబాద్‌ నుంచి వెళ్లిన మిగతా వారిలో ఎందరు తెలుగువారు ఉన్నారు, ఇతర ప్రాంతాలవారు హైదరాబాద్‌ నుంచి బుక్‌ చేసుకుని వెళ్లారా అన్న అంశంపై స్పష్టత లేదు. అంతేకాదు మరికొన్ని చిన్న ట్రావెల్స్‌ సంస్థల ద్వారా కూడా హైదరాబాద్‌ నుంచి పర్యాటకులు వెళ్లి ఉండవచ్చని చెబుతున్నారు. బుధవారం రాత్రి వరకు నేపాల్‌కు వెళ్లి, చిక్కుకున్న వారికి సంబంధించి పోలీ్‌సస్టేషన్లకు ఎలాంటి సమాచారం రాలేదని అఽధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్‌ నుంచి నేపాల్‌కు ఏటా నాలుగైదు వేల మంది పర్యాటకులు వెళుతుంటారని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలవారంతా హైదరాబాద్‌ మీదుగానే వెళతారని ఒక ట్రావెల్స్‌ నిర్వాహకుడు తెలిపారు. పేరొందిన పలు ట్రావెల్స్‌ సంస్థలు 8-10 రోజుల ప్యాకేజీలతో నేపాల్‌ టూర్‌కు తీసుకువెళ్తుంటాయని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి

నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..

Updated Date - Aug 27 , 2026 | 05:41 AM