Share News

మనుషులకు, రోబోలకు పరుగు పందెం!

ABN , Publish Date - Apr 20 , 2026 | 06:24 AM

మనుషులు, రోబోలు కలిసి ఒకే పరుగు పందెంలో పాల్గొనడం ఎన్నడూ చూసి ఎరుగం! ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చైనా రాజధాని బీజింగ్‌లో ఆదివారం ఈ పరుగుపందాలు...

మనుషులకు, రోబోలకు పరుగు పందెం!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19: మనుషులు, రోబోలు కలిసి ఒకే పరుగు పందెంలో పాల్గొనడం ఎన్నడూ చూసి ఎరుగం! ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చైనా రాజధాని బీజింగ్‌లో ఆదివారం ఈ పరుగుపందాలు జరిగాయి. ఈ పోటీల్లో చైనాకు చెందిన హానర్‌ అనే సంస్థ తయారు చేసిన ‘లైట్నింగ్‌’ అనే హ్యూమనాయిడ్‌ రోబో మెరుపు తీగలా ఉరికింది. ఒంట్లోని శక్తినంతా కాళ్లలోకి కూడగట్టుకొని.. వేగమే ఈర్షపడేంత వేగంగా పరుగెత్తుతున్న మానవ అథ్లెట్లను ఒక్కొక్కరినీ వెనక్కినెడుతూ ‘లైట్నింగ్‌’ విజేతగా ఆవిర్భవించి సరికొత్త చరిత్ర సృష్టించింది. 21.1 కి.మీ రేసును కేవలం 50 నిమిషాల 26 సెకన్లలో పూర్తిచేసి ఔరా అనిపించింది. ఇంతే దూరాన్ని జాకబ్‌ కిప్లిమో అనే అథ్లెట్‌ 57 నిమిషాల 20 సెకన్లలో పూర్తిచేసి ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్నారు. ‘హ్యూమనాయిడ్‌ రోబో హాఫ్‌ మారథాన్‌’ పేరుతో నిర్వహించిన ఈ పరుగుపందాల్లో 0.5 మీటర్ల నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు ఉన్న వందకు పైగా రోబోలు పాల్గొన్నాయి. ఎన్నో రోబోలు మానవ అథ్లెట్లను ఓడించి విజేతగా నిలిచాయి. అలా అని ఈ రోబోలకు చక్రాలు బిగించారేమో అని సందేహించొద్దు. మనుషుల మాదిరి కాళ్లున్న రోబోలనే ఈ పోటీల్లో అనుమతించారు.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 06:55 AM