Share News

ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిపై మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:37 AM

హైదరాబాద్‌లోని సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య, ర్యాగింగ్‌ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది.

ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిపై   మానవ హక్కుల కమిషన్‌ ఆగ్రహం
NHRC

న్యూఢిల్లీ, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య, ర్యాగింగ్‌ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. యూజీసీ మార్గదర్శకాలు, యాంటీ-ర్యాగింగ్‌ చట్టాలను అమలు చేయడంలో విఫలమై, నాలుగు నెలలు గడిచినా తీసుకున్న చర్యల నివేదిక సమర్పించని తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదివే ఎస్టీ విద్యార్థి శ్రీసాయి తేజ ర్యాగింగ్‌, వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ... నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని 23 ఏప్రిల్‌ 2026న తెలంగాణ ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. నాలుగు నెలలకు పైగా సమయం గడిచినా అధికారుల నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడాన్ని కమిషన్‌ తీవ్రంగా పరిగణించింది. అక్టోబరు 28న ఆ అధికారి స్వయంగా తగిన నివేదికలతో హాజరు కావాలని ఆదేశించింది.

ఈ వార్తలు కూడా చదవండి

మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు

Updated Date - Oct 02 , 2026 | 04:39 AM