Share News

హిందూ మతం ఓ జీవన విధానం: సుప్రీంకోర్టు

ABN , Publish Date - May 14 , 2026 | 05:48 AM

హిందూ మత విశ్వాసానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ మతం ఓ జీవన విధానమని...

హిందూ మతం ఓ జీవన విధానం: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మే 13: హిందూ మత విశ్వాసానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ మతం ఓ జీవన విధానమని, హిందువులెవరైనా మతం పట్ల తమ విశ్వాసాన్ని చాటుకునేందుకు గుడికి వెళ్లి పూజలు చేయాల్సిన అవసరమేమీ లేదని పేర్కొంది. తమ ఇంట్లో దీపం వెలిగించినా సరిపోతుందని వ్యాఖ్యానించింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం, మత స్వేచ్ఛకు సంబంధించి పలు ఇతర పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్‌ నాగరత్న ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాల్సిన అవసరమేమీ లేదని, ఒకరి విశ్వాసాన్ని మరొకరు ప్రశ్నించాల్సిన అవసరమూ లేదని వ్యాఖ్యానించారు. కాగా, మత విశ్వాసాలపై ప్రతి ఒక్కరూ న్యాయస్థానాల్లో ప్రశ్నించడం మొదలుపెడితే వందల కొద్దీ పిటిషన్లు వస్తాయని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

Updated Date - May 14 , 2026 | 05:49 AM