హిమాచల్ సీఎం, ఎమ్మెల్యేల వేతనాల్లో కోత
ABN , Publish Date - Apr 23 , 2026 | 05:31 AM
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...
ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం
సిమ్లా, ఏప్రిల్ 22: ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం.. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల వేతనాల్లో తాత్కాలిక కోత అమలు కానుంది. ఆరు నెలల పాటు సీఎం వేతనంలో 50ు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వేతనాల్లో 30ు, ఎమ్మెల్యేల వేతనాల్లో 20ు కోత పడనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే కోత విధించిన సొమ్మును తిరిగి ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం నుంచి గ్రాంట్లు నిలిచిపోవడం హిమాచల్ ఆర్థిక కష్టాలకు ప్రధాన కారణం.
ఇవి కూడా చదవండి..
పీఎంపై వ్యాఖ్యల వివాదం.. ఖర్గేకు ఈసీ నోటీసు
సీఎం సిద్ధరామయ్యపై చేతబడి జరిగిందేమో.. మంత్రి సంచలన వ్యాఖ్యలు