Share News

ఫైబర్‌ ఆప్టిక్‌ డ్రోన్లతో ఇజ్రాయెల్‌కు సవాల్‌

ABN , Publish Date - May 01 , 2026 | 05:50 AM

ఇజ్రాయెల్‌ అత్యాధునిక రక్షణ వ్యవస్థలను సవాలు చేసేందుకు హిజ్బొల్లా ఉక్రెయిన్‌ తరహా ఫైబర్‌-ఆప్టిక్‌ డ్రోన్‌ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్‌పై..

ఫైబర్‌ ఆప్టిక్‌ డ్రోన్లతో ఇజ్రాయెల్‌కు సవాల్‌

  • ఉక్రెయిన్‌ శైలి టెక్నాలజీతో దెబ్బకొడుతున్న హిజ్బొల్లా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30: ఇజ్రాయెల్‌ అత్యాధునిక రక్షణ వ్యవస్థలను సవాలు చేసేందుకు హిజ్బొల్లా ఉక్రెయిన్‌ తరహా ఫైబర్‌-ఆప్టిక్‌ డ్రోన్‌ టెక్నాలజీని వినియోగిస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్‌పై దాడుల్లో కొత్త తరం ఫైబర్‌-ఆప్టిక్‌ నియంత్రిత డ్రోన్లను రంగంలోకి దింపింది. సాంప్రదాయ రేడియో తరంగాలకు బదులుగా డ్రోన్‌కు, ఆపరేటర్‌కు మధ్య ఉండే అతి సన్నని ఫైబర్‌-ఆప్టిక్‌ కేబుల్స్‌ ద్వారా వీటిని నియంత్రిస్తారు. ఈ డ్రోన్లు రేడియో సంకేతాలను ఉపయోగించవు కాబట్టి ఇజ్రాయెల్‌ ఎలకా్ట్రనిక్‌ వార్‌ఫేర్‌ వ్యవస్థలు వీటిని జామ్‌ చేయలేవు. అలాగే చిన్నగా ఉండే ఈ డ్రోన్లు రాడార్లకు కూడా చిక్కవు. దీంతో ఇజ్రాయెల్‌ రక్షణ వ్యవస్థలకు వీటిని అడ్డుకోవడం సవాల్‌గా మారింది. దక్షిణ లెబనాన్‌, సరిహద్దు పట్టణాల సమీపంలోని తమ సైనికులపై హిజ్బొల్లా ఈ డ్రోన్లను ఎక్కువగా ప్రయోగిస్తోందని ఇజ్రాయెల్‌ సైనిక అధికారులు చెబుతున్నారు. రష్యాతో యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్‌ ఫైబర్‌-ఆప్టిక్‌ నియంత్రిత డ్రోన్లను ఉపయోగించింది. ఇప్పుడు ఇదే టెక్నాలజీతో... పేలుడు పదార్థాలను ఉపయోగించి స్థానికంగా తయారు చేసిన డ్రోన్లతో హిజ్బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికాకు హ్యాండిచ్చిన పాక్.. ఇరాన్‌కు సాయం!

పుతిన్ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రంప్.. 90 నిమిషాలు మాట్లాడుకున్న నేతలు..

Updated Date - May 01 , 2026 | 06:51 AM