భారత్‌లో వరికి వడదెబ్బ!
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:59 AM
అతి వేడి గాలులు భారతదేశంలో వ్యవసాయ కార్మికులకు, వరి ఉత్పత్తికి తీవ్ర ముప్పుగా పరిణమించనున్నాయని ఐక్యరాజ్యసమితి ఆహార-వ్యవసాయ సంస్థ(ఎ్‌ఫఏవో), ప్రపంచ...
అతి వేడి గాలులతో గణనీయంగా తగ్గనున్న ఉత్పత్తి
ప్రపంచ వాతావరణ, ఆహార-వ్యవసాయ సంస్థల హెచ్చరిక
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: అతి వేడి గాలులు భారతదేశంలో వ్యవసాయ కార్మికులకు, వరి ఉత్పత్తికి తీవ్ర ముప్పుగా పరిణమించనున్నాయని ఐక్యరాజ్యసమితి ఆహార-వ్యవసాయ సంస్థ(ఎ్‌ఫఏవో), ప్రపంచ వా తావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) హెచ్చరించాయి. ప్రత్యేకించి అధిక జనసాంద్రత కలిగిన గంగా, సింధూ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గనున్నట్టు తెలిపాయి. భారత్‌లో వరి, ఇతర సాగు ఉత్పత్తులపై అతి వేడి గాలుల ప్రభావాన్ని సంయుక్తంగా విశ్లేషించి రూపొందించిన నివేదికను బుధవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఆ సంస్థలు విడుదల చేశాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్(జూన్ నుంచి సెప్టెంబరు వరకు)లో సాధారణం కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని ముందస్తు అంచనాలు వెలువడిన నేపథ్యంలో తాజా నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఏడాది అసాధారణ వేడి వాతావరణం వల్ల వడగాడ్పులు ఎక్కువ రోజులు కొనసాగనున్నట్టు డబ్ల్యూఎంవో తెలిపింది. పశు, మత్స్య సంపద, పౌల్ర్టీ, డెయిరీ ఉత్పత్తులపైనా అతి వేడిగాలులు తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్టు డబ్ల్యూఎంవో ప్రధానకార్యదర్శి సెలెస్టే సావ్‌లో పేర్కొన్నారు. నూతన వాతావరణ పరిస్థితులను తట్టుకునే పంట రకాలు, జీవజాతులను ఎంపిక చేసుకోవడం, తగిన యాజమాన్య చర్యలు చేపట్టడం అవసరమని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి..
శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్
నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి