Share News

గుండె జబ్బు.. మింగేస్తోంది!

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:53 AM

రోజువారీ ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగంతో పాటు పండ్లు, తృణధాన్యాలు తక్కువగా తీసుకోవడం గుండె జబ్బులకు దారితీస్తోందని ఓ అధ్యయనం...

గుండె జబ్బు.. మింగేస్తోంది!

  • అధిక ఉప్పు, తక్కువగా పండ్ల వినియోగంతో ముప్పు

  • 2023లో ఈ ఆహారపు అలవాట్లతో 59లక్షల మంది మృతి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 23: రోజువారీ ఆహారంలో మితిమీరిన ఉప్పు వినియోగంతో పాటు పండ్లు, తృణధాన్యాలు తక్కువగా తీసుకోవడం గుండె జబ్బులకు దారితీస్తోందని ఓ అధ్యయనం హెచ్చరించింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా సంభవించిన 59 లక్షలకు పైగా హృదయ సంబంధిత మరణాలకు ఈ ఆహారపు అలవాట్లే కారణమని తెలిపింది. ఈ తరహా మరణాలు చైనాలో అత్యధికంగా 13.6 లక్షలు, ఆ తర్వాత భారత్‌లో 11.1 లక్షలు నమోదయ్యాయి. ‘గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌ స్టడీ-2023’ డేటాను విశ్లేషించడం ద్వారా చైనాలోని బీజింగ్‌ చిల్డ్రన్‌ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు 33 ఏళ్ల కాలంలో 13 ఆహార సంబంధిత ముప్పులపై అధ్యయనం చేశారు. ఈ పరిశోధన వివరాలు ‘ది ఇన్నోవేషన్‌ న్యూట్రిషన్‌’ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి. సరైన ఆహారపు అలవాట్లు పాటించకపోవడమే గుండెజబ్బులు, పక్షవాతానికి ప్రధాన కారణమని ఈ నివేదిక వెల్లడించింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ మహిళలతో పోలిస్తే పురుషులపైనే ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

శాంతి చర్చల విషయంలో ఒత్తిడి లేదు.. మా దృష్టి దాని పైనే: డొనాల్డ్ ట్రంప్

నెతన్యాహు ప్లాన్‌ను వాళ్లు తిరస్కరించారు.. ట్రంప్ అంగీకరించారు: విదేశాంగ మాజీ కార్యదర్శి

Updated Date - Apr 24 , 2026 | 05:53 AM