ప్రియురాలిని కంట్రోల్ చేయడానికి క్షుద్ర పూజలు.. యువకుడి చితినుంచి ఎముకలు సేకరించి..
ABN , Publish Date - May 05 , 2026 | 02:57 PM
ప్రియురాలిని, ఆమె కుటుంబాన్ని కంట్రోల్ చేయడం కోసం ఓ యువకుడు మాంత్రికుడిని ఆశ్రయించాడు. మాంత్రికుడి సాయంతో క్షుద్ర పూజలు చేయడానికి పూనుకున్నాడు. క్షుద్రపూజల కోసం ఏకంగా చితి నుంచి ఎముకలను సేకరించి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు.
లక్నో, మే 5: ప్రియురాలిని, ఆమె కుటుంబాన్ని కంట్రోల్ చేయడం కోసం ఓ యువకుడు మాంత్రికుడిని ఆశ్రయించాడు. మాంత్రికుడి సాయంతో క్షుద్ర పూజలు చేయడానికి పూనుకున్నాడు. క్షుద్రపూజల కోసం ఏకంగా చితి నుంచి ఎముకలను సేకరించి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హపుర్‌కు చెందిన అమన్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. తన ప్రేమ సంగతి ఆమెకు చెప్పాడు. ఆ అమ్మాయి అతడి ప్రేమకు నో చెప్పింది. తన కుటుంబానికి ఇలాంటివి నచ్చవని, తనకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే అమన్ తన మిత్రుడితో కలిసి అవదేశ్ శర్మ అనే మాంత్రికుడిని కలిశాడు. ప్రియురాలిని, ఆమె కుటుంబాన్ని తన కంట్రోల్‌లోకి వచ్చేలా చేయమని అడిగాడు. క్షుద్రపూజలు చేస్తే ఫలితం ఉంటుందని అవ్‌దేశ్ చెప్పాడు. క్షుద్రపూజల కోసం చితి నుంచి ఎముకలు తీసుకురావాలని అన్నాడు. ముగ్గురూ ఎముకల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. రెండు రోజుల క్రితం 16 ఏళ్ల సుభాన్షు అనారోగ్యం కారణంగా చనిపోయాడు. కుటుంబసభ్యులు శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహించి అక్కడినుంచి వెళ్లిపోయారు.
అమన్, అతడి స్నేహితుడు, మాంత్రికుడు బైకుపై శ్మశానికి వచ్చారు. చితినుంచి ఎముకలు సేకరించారు. ఇది గమనించిన అక్కడి వారు గట్టిగా కేకలు వేశారు. దీంతో భయపడిపోయిన ముగ్గురూ బైకుపై పరారయ్యారు. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ముగ్గురిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి క్షుద్ర పూజల సామాగ్రి, 50 ఫొటోలు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి
లఖ్‌నవూ మ్యాచ్‌లో హార్దిక్ ఆడకపోవడానికి కారణం అదే: రికెల్టన్
మహానాడుపై కాకాణివి అనవసరపు మాటలు: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి