Share News

జ్ఞానేశ్‌ రాజీనామాతోనే ఆగబోం

ABN , Publish Date - Oct 08 , 2026 | 01:26 AM

భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమం, ఆ తర్వాత కూడా కొనసాగుతుందని కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ), పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి.

జ్ఞానేశ్‌ రాజీనామాతోనే ఆగబోం
souravdas press meet

  • ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యంగా ఆ తర్వాత కూడా పోరాడతాం

  • సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలి

  • 10న అందరూ ఢిల్లీకి కదలండి సీజేపీ, విద్యార్థి సంఘాల పిలుపు

న్యూఢిల్లీ, అక్టోబరు 7: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమం, ఆ తర్వాత కూడా కొనసాగుతుందని కాక్రోచ్‌ జనతాపార్టీ (సీజేపీ), పలు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. మొత్తంగా ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన అయ్యేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. ఈ మేరకు సుదీర్ఘ పోరాటానికి సిద్ధం కావాలని తమ కార్యకర్తలు, విద్యార్థులకు పిలుపునిచ్చాయి. జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా కోరుతూ సీజేపీ ఈ నెల 10న ఢిల్లీ జంతర్‌మంతర్‌లో నిరసన కార్యక్రమాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏఐఎ్‌సఏ, ఏఐఎ్‌సఎఫ్‌, ఎస్‌ఎ్‌ఫఐ, ఏఎ్‌సఏపీ తదితర విద్యార్థి సంఘాల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. అందరూ.. కలిసి బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. సీఈసీ రాజీనామా కోరుతూ, మంగళవారం ఇండియా కూటమి ఎంపీలు నిర్వహించిన నిరసన కార్యక్రమాన్ని ముక్తకంఠంతో స్వాగతించారు. ‘‘విస్తృత రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఉద్యమం ఇది. ప్రధానంగా ప్రజాస్వామ్య పరిరక్షణ శక్తులకు, బీజేపీకి మధ్య ఈ పోరాటం కొనసాగుతోంది.’’ అని స్పష్టం చేశారు. సీజేపీ కో- కన్వీనర్‌ సౌరవ్‌ దాస్‌ మాట్లాడుతూ.. ఈ నెల 10న దేశ పౌరులంతా ఢిల్లీకి రావాలని కోరారు. ‘‘ఈ పోరాటం తేలిగ్గా ముగియదు. లక్ష్యాన్ని చేరుకోవడానికి సుదీర్ఘ కాలమే పడుతుంది. ప్రతి ఒక్కరూ ఢిల్లీకి కదలండి’’ అని పిలుపునిచ్చారు. ఏఐఎస్‌ఏ అధ్యక్షురాలు నేహా బోరా మాట్లాడుతూ.. విపక్షాల ఆందోళనలను, విద్యార్థుల నిరసనలను వేర్వేరుగా చూడొద్దన్నారు. ‘ఈ దేశ పౌరులమైన మాకు, బీజేపీకి మధ్య పోరాటం ఇది. దేశ ప్రజలు, విపక్షాలు, కార్మిక యూనియన్లు, విద్యార్థి సంఘాల మధ్య ఎటువంటి విభజనా లేదు. ఉమ్మడిగా నిలబడతాం.తలపడతాం’’ అని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

శివరాజ్‌కుమార్‌కు తప్పిన ప్రమాదం.. ముఖానికి అతి సమీపాన పేలిన టపాసులు

ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం..

Updated Date - Oct 08 , 2026 | 01:26 AM