Share News

తండ్రి ఉరికి వేలాడుతుంటే వీడియో తీసిన కొడుకు..

ABN , Publish Date - Aug 02 , 2026 | 10:38 AM

హర్యానాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడి కుటుంబసభ్యులు భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్యే అతడిని చంపి, ఆత్మహత్య నాటకం ఆడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తండ్రి ఉరికి వేలాడుతుంటే వీడియో తీసిన కొడుకు..
Gurugram Man

ఇంటర్‌నెట్ డెస్క్: హర్యానాలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతడి కుటుంబసభ్యులు భార్య మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భార్యే అతడిని చంపి, ఆత్మహత్య నాటకం ఆడుతోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన సంజీవ్ యాదవ్ హర్యానాలోని డెన్సో కంపెనీలో పని చేస్తున్నాడు.


గురుగ్రామ్‌లోని సూరత్ నగర్ ఏరియాలో భార్య మన్‌ప్రీత్ కౌర్, ఏడేళ్ల కుమారుడితో నివాసం ఉంటున్నాడు. గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తనకు విడాకులు కావాలని భార్య తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే గురువారం సంజీవ్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు సంజీవ్ యాదవ్ ఇంటికి వెళ్లారు. పోలీసులు ఇంటికి వెళ్లే సమయానికి ఉరికి వేలాడుతున్న సంజీవ్‌ను అతడి కుమారుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తున్నాడు. భార్య దూరంగా నేలపై కూర్చుని ఏడుస్తోంది.


పోలీసులు ఉరికి వేలాడుతున్న సంజీవ్ బాడీని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సంజీవ్‌ది ఆత్మహత్య కాదని, మన్‌ప్రీత్ కౌర్ హత్య చేసిందని అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో సంజీవ్ మరణానికి గల కచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అరెస్ట్

బద్దకం వదిలేదెలా..?

Updated Date - Aug 02 , 2026 | 10:42 AM