బద్దకం వదిలేదెలా..?
ABN , Publish Date - Aug 02 , 2026 | 09:58 AM
వర్షాకాలంలో తరచూ బద్దకంగా అనిపిస్తూ ఉంటుంది. దీని నుంచి ఎలా బయటపడాలో చూద్దాం...
వర్షాకాలంలో తరచూ బద్దకంగా అనిపిస్తూ ఉంటుంది. దీని నుంచి ఎలా బయటపడాలో చూద్దాం...
కష్టంగా అనిపించినప్పటికీ రోజూ ఒకే సమయానికి నిద్ర లేస్తే రోజంతా చురుగ్గా అనిపిస్తుంది.
నిద్ర లేచిన వెంటనే దుప్పట్లు మడతపెట్టి బెడ్ సర్దేయాలి. కిటికీలు, తలుపులు తెరిచేస్తే తాజా గాలి లోపలికి ప్రసరిస్తుంది.
వర్షం కారణంగా జిమ్‌కు వెళ్లాలనిపించకపోతే ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేస్తే శరీరంలో రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. జీవక్రియల వేగం పెరిగి బద్దకం సులువుగా వదులుతుంది.
ఉదయాన్నే అల్పాహారంతోపాటు తాజా పండ్లు తీసుకోవాలి. మితంగా డ్రై ఫ్రూట్స్ తినాలి. వేడివేడిగా హెర్బల్ టీ తాగితే ఉత్సాహంగా అనిపిస్తుంది.
దాహం అనిపించకపోయినా గంటకోసారి కొద్దిగా మంచినీటిని తాగుతుంటే అలసట తీరుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఏకాగ్రత, చురుకుదనం పెరుగుతాయి.
చేయాల్సిన పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించి త్వరగా పూర్తిచేయడానికి ప్రయత్నించాలి. దీనివల్ల పనులు వాయిదా వేసే ధోరణి తగ్గుతుంది. పనులు పూర్తవుతున్న కొద్దీ బద్దకంగా అనిపించదు.