Share News

నేను అక్కడికక్కడే చనిపోయి ఉండేదాన్ని: నిందితుడికి గురుగ్రామ్ బైకర్ సియా కౌంటర్

ABN , Publish Date - Sep 15 , 2026 | 09:45 AM

హర్యానాలోని గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారు ఢీకొట్టిన ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

నేను అక్కడికక్కడే చనిపోయి ఉండేదాన్ని: నిందితుడికి గురుగ్రామ్ బైకర్ సియా కౌంటర్
Gurugram hit and run

ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలోని గురుగ్రామ్‌లో మహిళా బైకర్‌ను కారు ఢీకొట్టిన ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఈ ఘటనలో బాధితురాలైన బైకర్ సియా.. నిందితుడు కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 'మీకు నా మీద జాలి ఉంటే.. ఎందుకు ఆపలేదు? నేను అక్కడికక్కడే చనిపోయి ఉండేదాన్ని' అని పేర్కొన్నారు (Gurugram hit and run).


ఘటన గురించి కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. బైక్ నడుపుతున్నది మహిళో, పురుషుడో తనకు తెలియలేదని, సియా పట్ల బాధ కలిగిందని కల్యాణ్ పేర్కొన్నారు. బైకర్లు పదేపదే వేగం పెంచుతూ, తగ్గిస్తూ తనను రెచ్చగొట్టారని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆ బైక్‌ను ఢీకొట్టలేదని చెప్పారు. అలాగే యాక్సిడెంట్ తర్వాత బైకర్ల గుంపు తనను, తన కుటుంబాన్ని కొట్టే ప్రమాదం ఉందనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపారు. కల్యాణ్ వ్యాఖ్యలపై తాజాగా సియా స్పందించారు (Gurugram biker Sia).


'నేను మహిళనని తెలియదనడం అవాస్తవం. కారు నాకు దగ్గరగా వచ్చినప్పుడు నా జుట్టు వారికి కనిపించింది (Gurugram road rage). నన్ను ఆపాలని సైగలు చేశారు. అలాంటప్పుడు బైక్‌పై ఉన్నది మహిళ అని తెలియదని చెప్పడం నమ్మశక్యంగా లేదు. మేం వాళ్లను రెచ్చగొట్టలేదు. మీరు నిజంగా నా గురించి ఆందోళన చెందితే.. ప్రమాదం జరిగిన వెంటనే ఎందుకు ఆపలేదు. నేను అక్కడికక్కడే చనిపోయి ఉండేదాన్ని' అని సియా పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

హోర్ముజ్ భద్రత కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి.. దేశాలకు ట్రంప్ డిమాండ్..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 15 , 2026 | 09:46 AM