ఎల్‌పీజీ గ్యాస్ ధరల పెంపుపై పెట్రోలియం శాఖ కీలక ప్రకటన
ABN , Publish Date - Jun 07 , 2026 | 02:08 PM
భారత్‌లో గృహవినియోగ గ్యాస్ ధరలు ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో గృహ వినియోగ గ్యాస్ (ఎల్‌పీజీ) ధర మరోసారి రూ.29 మేర పెరిగింది. నేటి నుంచే ఈ పెంపు అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇప్పటికీ ఎల్‌పీజీ ధర తక్కువేనని పేర్కొంది. ఈ సిలిండర్‌ను సప్లై చేసేందుకు ప్రస్తుతం రూ.1600లకు పైనే ఖర్చవుతోందని వెల్లడించింది. అయితే, ఢిల్లీలోని ఒక సాధారణ కస్టమర్ ఒక సిలిండర్ కోసం రూ.942 చెల్లిస్తుంటారని చెప్పింది.
భారత్‌లోని ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలతో ముడి పడి ఉంటాయని కూడా పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం ధరల్లో మార్పులు చేస్తుంటుందని వెల్లడించింది. ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై వందల రూపాయాల భారం సామాన్యులపై పడకుండా స్వయంగా మోస్తోందని తెలిపింది. కమర్షియల్ సిలిండర్ ధరలను మాత్రం నెలనెలా సవరిస్తునే ఉంటామని తెలిపింది. ఇది అంతర్జాతీయ మార్కెట్ ధరలను ప్రతిఫలిస్తుందని చెప్పింది.
భారత్ ఎల్‌పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతుల ద్వారా తీరుతోంది. భారత్‌లో ధరలు.. సౌదీ ఆయిల్ సంస్థ అరామ్కో నిర్ణయించే సౌదీ కాంట్రాక్ట్ ధరపై ఆధారపడి ఉంటాయి. సౌదీ సంస్థ ఈ ధరను ప్రతి నెలా మొదట్లో సవరిస్తుంటుంది. భారత్ వినియోగించే ఎల్‌పీజీ (ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల 50:50 మిశ్రమం) కాంట్రాక్ట్ ధర పశ్చిమాసియా ఉద్రికత్తల ముందు టన్నుకు 542 డాలర్లుగా ఉండేది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం ఈ ధర 790 డాలర్లకు చేరింది.
ఈ వార్తలనూ చదవండి:
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చీరల కింద దాక్కున్న టీఎంసీ కార్యకర్త!
రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ! 11న కీలక ప్రకటన